- November 10, 2021
కపట నాటక సూత్రధారి.. విడుదలకు రెడీ

కపట నాటక సూత్రధారి అనే టైటిలే కొత్తగా ఉంది. అయితే టైటిల్‌తోనే సినిమా మీద అంచనాలను పెంచేశారు. ఇప్పటి వరకు వదిలిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా ఆకట్టుకున్నాయి. విజయ్ శంకర్,ఇందు ప్రధాన పాత్రల్లో వస్తోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నటుడు శివారెడ్డి, నాంది డైరెక్టర్ విజయ్ కనకమేడల చీఫ్ గెస్టులుగా వచ్చారు.
క్రాంతి సైనా దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మనీష్ (హలీమ్) నిర్మాతగా వ్యవహరించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివారెడ్డి టైటిల్ గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. టైటిల్ చాలా బాగుంది. ఇన్ని రోజులు ఇంత మంచి టైటిల్ ఎలా వదిలేశారని అనిపించిందంటూ నవ్వులు పూయించాడు. ఇక నాంది డైరెక్టర్ తన ఆప్త మిత్రుల కోసం ఈవెంట్‌కు వచ్చినట్టు తెలిపాడు.
శివారెడ్డి గారి సోదరుడిగా సినిమాలలోకి వస్తున్నాను. శివారెడ్డి గారి అన్ని పనులు చూస్తున్నాను. అప్పుడప్పుడు నేనెప్పుడూ స్టేజి ఎక్కుతాను అని అనుకునేవాడిని.. ఆ అవకాశం ఇప్పుడు వచ్చిందని నటుడు సంపత్ అన్నాడు. ఇది చాలా మంచి కథ అని హీరో విజయ్ శంకర్ అన్నాడు. కథ ను నమ్మి ఈ సినిమా ను ఇంత వరకు తీసుకొచ్చిన నిర్మాత గారికి కృతజ్ఞతలని దర్శకుడు క్రాంతి అన్నాడు. కథ వినగానే ఈ సినిమాను నిర్మించాలని ఫిక్స్ అయ్యానంటూ నిర్మాత మనీష్ అన్నాడు. నవంబర్ 12న ఈ సినిమా చూసి హిట్ చేయాలని నిర్మాత కోరాడు.