• January 20, 2022

వరుణ్ తేజ్‌కు విషెస్ చెప్పని కళ్యాణ్ దేవ్.. ఇక కన్ఫామ్ అయినట్టే!

వరుణ్ తేజ్‌కు విషెస్ చెప్పని కళ్యాణ్ దేవ్.. ఇక కన్ఫామ్ అయినట్టే!

    Sreeja Kalyaan Divorce మెగా హీరోల్లో ఎవరి బర్త్ డే ఉన్నా కూడా అందరూ విషెస్ చెప్పుకుంటారు. ఒకరినొకరు పలకరించుకుంటారు. పండుగల సమయంలో అందరూ కలిసి మెలిసి ఉంటారు. అయితే ఇప్పుడు మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్‌కు పెద్ద కష్టమొచ్చి పడింది. మెగా అండదండలతోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. చిరు చిన్న కూతురు శ్రీజ భర్తగానే గుర్తింపు సంపాదించుకున్నాడు.

    అయితే ఇప్పుడు ఆ ట్యాగ్ పోయే పరస్థితి వచ్చింది. కళ్యాణ్ దేవ్ పేరుని తన పేరులోంచి తీసేసింది శ్రీజ. ఇన్ని రోజులు తన ఇన్ స్టా ఐడీలో శ్రీజ కళ్యాణ్ అని ఉండేది. కానీ ఇప్పుడు శ్రీజ కొణిదెలగా మారిపోయింది. అంతే కాకుండా శ్రీజ ఫ్రెండ్స్ లిస్ట్‌లోంచి కూడా కళ్యాణ్ దేవ్‌ని తీసిపారేసింది. అయితే కళ్యాణ్ దేవ్ మాత్రం సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా యాక్టివ్‌గా ఉండటం లేదు.

    క్రిస్మస్ రోజు లాస్ట్ పోస్ట్ చేశాడు కళ్యాణ్ దేవ్. శ్రీజను కళ్యాణ్ దేవ్ ఇంకా ఫాలో అవుతున్నాడు. అయితే ఈ ఇద్దరి మధ్య విడాకులు దాదాపుగా కన్ఫామ్ అయినట్టేనని తెలుస్తోంది. ఈ ఇద్దరూ వేర్వేరుగానే ఉంటున్నారని, అధికారికంగా త్వరలోనే ప్రకటిస్తారని తెలుస్తోంది. అయితే నిన్న వరుణ్ తేజ్ బర్త్ డే. ఒక వేళ వరుణ్ తేజ్‌కు కళ్యాణ్ దేవ్ విషెస్ చెబితే.. రూమర్లకు చెక్ పడ్డట్టు అయ్యేది.

    కానీ కళ్యాణ్ దేవ్.. అలా ఏం చేయలేదు. వరుణ్ తేజ్‌కు విషెస్ చెప్పలేదు. కానీ గత ఏడాది మాత్రం వరుణ్ తేజ్‌కు స్పెషల్‌గా విషెస్ అందించాడు. అసలు కళ్యాణ్ దేవ్, శ్రీజ విడిపోయినా మూడు నాలుగు నెలలు అవుతోందనే రూమర్ కూడా ఉంది. అందుకు దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సెలెబ్రేషన్స్‌లో కళ్యాణ్ దేవ్ కనిపించలేదని తెలుస్తోంది.

    Leave a Reply