• January 30, 2022

ఎన్టీఆర్ భార్య పేరుతో ఫేక్ అకౌంట్!.. ట్విట్టర్‌లో జోరుగా చర్చలు

ఎన్టీఆర్ భార్య పేరుతో ఫేక్ అకౌంట్!.. ట్విట్టర్‌లో జోరుగా చర్చలు

    Lakshmi Pranathi Twitter Fake Id యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి సోషల్ మీడియా ప్రపంచానికి దూరంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఎప్పుడైనా ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తే తప్పా ప్రణతి ఎక్కడా కనిపించరు. ఇక విదేశాలకు బయటకు వెళ్లినా, పెళ్లిళ్లు, ఈవెంట్లు అంటూ బయట కనిపిస్తే కెమెరాలు బంధిస్తుంటాయి. అలాంటప్పుడే ప్రణతి ఫోటోలు బయటకు వస్తాయి.

    అయితే ప్రణతి ఇలా సోషల్ మీడియా ప్రపంచానికి దూరంగా ఉంటుందని అందరికీ తెలిసిందే. అలాంటి ప్రణతి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇస్తే ఎలాంటి హంగామా ఉంటుందో అందరికీ తెలిసిందే. కానీ కొంత మంది ఫ్యాన్స్ మాత్రం గుడ్డిగా అన్నింటిని నమ్మేస్తుంటారు. లక్ష్మీ ప్రణతి పేరుతో ఓ ట్విట్టర్ అకౌంట్ మూడు రోజుల క్రితం ఓపెన్ అయింది. అందులో మొదటి ట్వీట్‌గా తన లవబుల్ హజ్బండ్‌తో దిగిన ఫోటోను షేర్ చేస్తున్నాను అని ప్రణతి పేరుతో ఉన్న ఓ అకౌంట్‌ నుంచి పోస్ట్ వచ్చింది.

    ఇక ఇది ఫేక్ అని ఇట్టే అర్థమవుతుంటే.. కొందరు ఫ్యాన్స్ మాత్రం తెగ ఫాలో అవుతున్నారు. ఇంకొంత మంది అభిమానులు మాత్రం ఆ అకౌంట్ ఫేక్, అందరూ రిపోర్ట్ కొట్టేయండని కోరుతున్నారు. మొత్తానికి ఇది ఫేక్ అకౌంటా? లేదా రియల్ అకౌంటా? అన్నది అధికారికంగా ప్రకటిస్తేనే తెలిసేలా ఉంది. ఇలాంటివి మొదట్లోనే అరికడితే ప్రమాదాన్ని నివారించిన వారవుతారు. దీనిపై ఎన్టీఆర్ స్పందిస్తాడో లేదో చూడాలి.

    ఇక అందులో షేర్ చేసిన ఫోటోలు కూడా మరీ కామెడీగా అనిపిస్తాయి. ఫోటో షాప్‌లో ఎడిట్ చేసినట్టుగానే అనిపిస్తాయి. మరి ఈ ఫేక్ అకౌంట్ సంగతిని అభిమానులు ఎలా అడ్డగిస్తారో మరి.

    Leave a Reply