- December 11, 2021
RRR Promotions : ఎన్టీఆర్ వాచ్ హైలెట్.. మరీ అన్ని కోట్లా?
Jr NTR Watch Price-RRR సినిమా ప్రమోషన్స్‌లో ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి ఇలా అందరూ ఫుల్ బిజీగా ఉన్నారు. ట్రైలర్ విడుదల చేసిన క్షణం నుంచి మీడియాతో RRR యూనిట్ ఇంటరాక్ట్ అవుతూనే ఉంది. ముంబైలో RRR యూనిట్ ట్రైలర్‌ను లాంచ్ చేసి అక్కడి మీడియాతో ముచ్చటించింది. ఆ తరువాత బెంగళూరు, చెన్నై అంటూ అటూ ఇటూ తిరుగుతోంది.
ఇక నేడు RRR యూనిట్ హైద్రాబాద్‌లో మీడియాతో ముచ్చటించింది. ఇందులో అలియా భట్ కూడా పాల్గొంది. కానీ కొద్ది సేపు ఉంది. ఆ తరువాత వెళ్లిపోయింది. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ సంభాషణలతో మీడియా సమావేశం అంతా కూడా సరదాగా సాగింది. అయితే ఇంత వరకు జరిగిన అన్ని ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ తన చేతికి పెట్టుకున గడియారం మాత్రం తెగ వైరల్ అవుతోంది.
అసలే ఎన్టీఆర్‌కు కాస్ట్ లీ కార్లు అన్నా ఇలాంటి స్పెసల్ వాచీలన్నా కూడా ఎంతో మక్కువ. ఇక 9 నంబర్ అంటే మాత్రం పిచ్చి. అలా ఎన్టీఆర్ ప్రస్తుతం ధరించిన గడియారం గురించి వెదుకులాట ప్రారంభమైంది. దీంతో ఒక్కొక్కొరు వాచ్ గురించి రీసెర్చ్ చేస్తున్నారు. దాని ధర ఎంత అయి ఉంటుందని కామెంట్లతో హెరెత్తిస్తున్నారు. మీమ్‌లతో చెలరేగిపోతోన్నారు.
Jr NTR Watch Price రిచర్డ్ మిల్లె ఆర్ఎం 011 కార్బన్ ఎన్టీపీటీ గ్రాస్ జీన్ రోజ్ గోల్డ్ లోటస్ ఎఫ్ 1 టీం లిమిటెడ్ ఎడిషన్ అంటా.. దాని ధర దగ్గరదగ్గరగా నాలుగు కోట్లు ఉంటుందని నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మొత్తానికి ఈ కాస్ట్ లీ వాచ్‌ల ఫ్యాంటసీ మాత్రం పీక్స్‌లో ఉందని అర్థమవుతోంది.