- November 23, 2021
ఆ ఒక్క షాట్ కోసం పన్నెండు గంటలు!.. జక్కన్న పర్‌ఫెక్షన్‌పై ఎన్టీఆర్ కామెంట్స్

రాజమౌళి ఒక్క షాట్ కోసం ఎన్ని గంటలైనా సరే పట్టుబట్టి మరీ చేయిస్తాడు. ఓపికతో ఎదురుచూస్తుంటాడు. తాను అనుకున్నట్టుగా రావాలని ఎంతో పరితపిస్తుంటాడు. జక్కన్న ఇంత వరకు మిస్ ఫైర్ అయింది లేదు. ఇక అవుతాడు అని కూడా ఎవ్వరూ అనుకోరు. రాజమౌళి సినిమా అంటే ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాల్సిందే. అలా ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. మొత్తానికి రాజమౌళి బాహుబలి సినిమాతో కేవలం ఇండియానే కాదు.. ప్రపంచంలోని చాలా దేశాలను తన వైపుకు తిప్పుకున్నాడు రాజమౌళి.
ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచాన్ని మరోసారి ఆశ్చర్యపరిచేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో రాజమౌళి ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటాడు.. ఒక్క షాట్ కోసం ఎంతలా పరితపిస్తాడో ఎన్టీఆర్ చెప్పాడు. ఈ మధ్య నాటు నాటు అనే సాంగ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పాటకు హీరోలు వేసిన స్టెప్పులు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.
ఆ ఇద్దరూ కలిసి వేసిన హుక్ స్టెప్ ఎంతగానో ఫేమస్ అయింది. అయితే ఆ షాట్ కోసం దాదాపు పన్నెండు గంటలు పట్టిందట. ఆ ఉక్రెయిన్‌లోని కివిలో షూట్ చేశారట. ఫారెన్ డ్యాన్సర్లు అవసరం పడటం, అప్పటి కరోనా పరిస్థితులు వల్ల ఇండియాలో షూట్ చేయలేక ఉక్రెయిన్ వెళ్లినట్టు ఎన్టీఆర్ చెప్పాడు.
నాటు నాటు స్టెప్పుల విషయంలో రాజమౌళి చాలా పర్టిక్యులర్‌గా గమనించాడు. ఎంత సింక్‌లో చేస్తున్నామా? అని పదే పదే రిపీట్ మోడ్‌లో పెట్టుకుని చూసేవాడు. ఇదిగో కాలు అలా వెళ్లింది. ఈ చెయ్యి ఇలా వచ్చింది.. సరిగ్గా రాలేదంటూ దాదాపు 12 గంటలు ఆ షాట్ కోసం కష్టపడ్డామని ఎన్టీఆర్ అన్నాడు. కానీ పాట వచ్చాక.. అందరూ సింక్‌లో చాలా బాగా డ్యాన్స్ చేశారంటూ మెచ్చుకుంటున్నారు. రాజమౌళి గారు అంత పర్ఫెక్ట్‌గా దాని గురించి ఎలా ఆలోచించారా? అని షాక్ అయ్యాను. అదే విషయాన్ని ఫోన్ చేసి చెప్పాను అని ఎన్టీఆర్ అన్నాడు.