- November 16, 2021
రాజమౌళి మెసెజ్ చేశాడంటే జోక్ అనుకున్నారు.. నవ్వుకున్నారు : జీతూ జోసెఫ్

దృశ్యం సినిమా అన్ని భాషల్లో హిట్ అయింది. మళయాలంలో మోహన్ లాల్‌తో జీతూ జోసెఫ్ చేసిన ఈ ప్రయత్నం అందరినీ మెప్పింది. తమిళం, తెలుగు, హిందీ ఇలా అన్ని భాషల్లో ఈ చిత్రం రీమేక్ అయింది. తెలుగులో వెంకటేష్ హీరోగా చేశాడు. మొదటి పార్ట్ సూపర్ హిట్ అయింది. ఇక రెండో పార్ట్‌లో కూడా వెంకటేష్ నటించాడు. ఈ చిత్రం నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్‌లో రాబోతోంది. మొత్తానికి తెలుగు వర్షన్‌కి కూడా జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నాడు
అయితే ఈ క్రమంలో సినిమాను ప్రమోట్ చేసే కార్యక్రమంలో భాగంగా నిన్న చిత్రయూనిట్ మీడియాతో ముచ్చటించింది. ఈ క్రమంలో రాజమౌళి చేసిన కామెంట్, ఇచ్చిన ప్రశంసలు. మాస్టర్ ఆఫ్ పీస్ అని పొగడటంపై జీతూ జోసెఫ్ స్పందించాడు. రాజమౌళి నుంచి మాస్టర్ పీస్ అనే కాంప్లిమెంట్ రావడం నిజంగా నమ్మలేకపోయానని ఆనాడు జరిగిన విషయాన్ని పూస గుచ్చినట్టు వివరించాడు. ఆరోజు నేను హైదరాబాద్‌లో నా ఫ్యామిలీతో ఉన్నప్పుడు రాజమౌళి నుంచి మెసేజ్ వచ్చింది.
నేను మొదట నమ్మలేదు. మామూలుగా ఇలాంటి మెసెజ్‌లు వస్తుంటాయ్ కదా? అని అనుకున్నాను. అది రాజమౌళి గారి నుంచి వచ్చిందని తెలియడంతో అలా షాక్‌లో ఉండిపోయాను. నా భార్య, పిల్లలు ఏమైందని అడిగారు. పేరు చెప్పకుండా.. ఆ మెసెజ్ చదివాను.. ఆ బాగానే ఉంది.. అందులో ఏముంది అన్నారు. ఆ తరువాత చెప్పాను. అది రాజమౌళి చేసిన మెసెజ్ అని. నా భార్య, పిల్లలు నమ్మలేదు. నేను జోక్ చేస్తున్నాను అని నవ్వుకున్నారు. కానీ మెసెజ్ చూపించడంతో మా పాప ఎగిరి గంతేసింది. అలా నా సంతోషాన్ని ఆపుకోలేక.. ఆ మెసెజ్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నాను అని చెప్పుకొచ్చాడు.