• November 1, 2021

Janaki Kalaganaledu Episode 161: మళ్లీ మోసపోయే శక్తి లేదు.. జ్ఞానాంబ కంటతడి.. జానకి ఎమోషనల్

Janaki Kalaganaledu Episode 161: మళ్లీ మోసపోయే శక్తి లేదు.. జ్ఞానాంబ కంటతడి.. జానకి ఎమోషనల్

    జానకి కలగనలేదు సీరియల్ ఇప్పుడు మంచి పీక్‌లో ఉంది. తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో సీరియల్ దూసుకుపోతోంది. ఇక సోమవారం నాటి ఎపిసోడ్‌‌లో గుండె బరువెక్కే ఎమోషనల్ సీన్‌తో రక్తికట్టించేశారు. బుడ్డోడు రజినీతో జ్ఞానాంబ తన బాధను చెప్పడం, ఆ మాటలన్నీ వింటూ జానకి ఎమోషనల్ అవ్వడంతో సీరియల్ అదిరిపోయింది. ఇక ఈ రోజు ఎపిసోడ్ ఎలా జరిగిందంటే..

    మల్లిక వంటగదిలో బీభత్సం సృష్టించింది. ఎలాగైనా సరే జ్ఞానాంబకు జానకి మధ్య ఇంకా దూరం పెంచాలనే ఉద్దేశ్యంతో కుట్రలు పన్నుతూనే ఉంది. కావాలనే మల్లిక గొడవలు పెట్టుకుంటోంది. వంటగదిలో జానకిని ఇష్టమొచ్చిన మాటలు అనేసింది మల్లిక. జ్ఞానాంబ రావడాన్ని చూసి ప్లేటు పిరాయింది. తిరిగి జానకినే దోషిగా నిలబెట్టేసింది. జ్ఞానాంబ ముందు మంచిదానిలా నటించి.. జానకి మీద ఇంకా ద్వేషం పెరిగేలా డైలాగ్స్ కొట్టేసింది. అత్తయ్య గారు పడుతున్న బాధను వివరించాను. నువ్ వంట చేస్తే అత్తయ్య గారు తినరు అని నేను అంటే.. ఆమె ఎలా తినదో నేను చూస్తాను అని నువ్ అన్నావ్ అంటూ జానకి మీద ఆరోపణలు చేసింది మల్లిక. ఇవన్నీ నేను ఎక్కడ అన్నాను మల్లిక అని జానకి అనడంతో జ్ఞానాంబ కోపం కట్టలు తెంచుకుంది.

    ఇది ఇళ్లు అనుకుంటున్నారా? సంత అని అనుకుంటున్నారా? అంటూ ఫైర్ అయింది. ఇంకెంత మన ఇంటి పరువును తీస్తారు. నా ముందు నిలబడటానికి కూడా భయపడే వారు కూడా నన్ను అవమానిస్తున్నారు.. ఇంకెంత చేస్తారు.. ఇంకెంత పరువుతీస్తారు.. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే మంచిది అంటూ జ్ఞానాంబ ఆవేశంతో వెళ్లిపోయింది. ఆ చివరి లైన్ నీకే అంటూ జానకికి మల్లిక చురకలు అంటించింది.

    ఇక బుడ్డోడు రజినీ పెద్దమ్మ జ్ఞానాంబ మీద కోపంతో ఇంటికి వచ్చాడు. తిననంటూ మారాం చేశాడు. రామన్నయ్యతో ఎందుకు మాట్లాడావ్.. అనాథలమైన మమ్మల్ని సొంత బిడ్డల్లా చూసుకుంటున్నావ్.. మేం ఏడిస్తేనే బాధపడతావ్.. అలాంటిది రామన్నయ్య ఏడిస్తే నీకు బాధ అనిపించడం లేదా? అని సూటిప్రశ్నలతో రజినీ గుండెల్లో గుచ్చేస్తుంటాడు. వాటికి సమాధానం చెప్పలేక జ్ఞానాంబ సతమతవుతుంది.

    మీ రామన్నయ్య అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా? అని జ్ఞానాంబ అంటే.. ఇష్టం కాదు ప్రాణం అని రజినీ అంటాడు. అలాంటి ప్రాణానికి ప్రాణమైన నా కొడుకు కొత్తగా వచ్చిన వారి కోసం నా దగ్గర అబద్దం చెబితే ఎలా ఉంటుంది.. ఎలా తట్టుకోగలను..కూతురిలా చూసుకుంటున్న కోడలు అబద్దాలు చెబితే ఎలా ఉంటుంది.. ఇద్దరూ కలిసి నన్ను వెర్రిబావుల్దాన్ని చేసేశారు. ఇక మోససోయే శక్తి నాకు లేదురా.. వాళ్లను ఎలా నమ్మగలను అంటూ జ్ఞానాంబ కన్నీరు పెట్టేసుకుంది.

    రామ తిరిగి ఇంటికి వస్తాడు. మెట్ల మీదే కూర్చుంటాడు. నిన్న వచ్చిన పూత రేకుల ఆర్డర్ చేయలేమని వాళ్లకు చెప్పురా? అంటూ రజినీకి ఫోన్ నంబర్ ఇస్తాడు. అలా ఆర్డర్ చేస్తే అత్యయ్య గారి పరువుపోతుంది?కదా మనం చేద్దాం పదా అని జానకి అంటుంది. పూతరేకులు చేయడం అంత సులభం కాదు.. అమ్మ చేసినట్టుగా ఎవ్వరూ చేయలేరు.. అంటూ రామ అంటాడు అలా ఎపిసోడ్ ముగుస్తుంది.

    అసలు మజా రేపటి ఎపిసోడ్‌లో రానుంది. పూతరేకులు ఆర్డర్ చేయకపోవడంతో రామ చొక్కా పట్టుకుంటాడు కస్టమర్. తన కొడుకు చొక్కా పట్టుకుంటావా? ఎంత ధైర్యం అంటూ సీన్లోకి జ్ఞానాంబ ఎంటర్ అవుతుంది. దీంతో రామ కళ్లలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆ సీన్ చూస్తే ఎవ్వరైనా సరే ఎమోషనల్ అవ్వాల్సింది. అంటే రేపటి వరకు ఆగాల్సిందే.

    Leave a Reply