- July 11, 2025
14 గంటల పని.. సినిమా కోసం కష్టపడుతున్న ఐశ్వర్య మీనన్

ఐశ్వర్య మీనన్ కోలీవుడ్‌లో అడపా దడపా చిత్రాలు చేస్తూ కాలం నెట్టుకొస్తోంది. ఇక నెట్టింట్లో ఈ అమ్మడు అందాల ప్రదర్శనకు అంతా ఫిదా అవ్వాల్సిందే. ఇక ఈ బ్యూటీ తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చింది కానీ అంతగా సక్సెస్ కాలేకపోయింది. భజే వాయు వేగం, స్పై అంటూ ఒకే సీజన్‌లో రెండు చిత్రాలతో సర్ ప్రైజ్ చేసింది. కానీ ఆమె మాత్రం తెలుగులో ఆశించిన సక్సెస్‌ను సాధించలేకపోయింది.
ఇక ఇప్పుడు ఓ ప్రాజెక్ట్ కోసం ఏకంగా పద్నాలుగు గంటల వర్క్ షాప్ చేసిందట. అసలు పని గంటలు అంటూ కొంత మంది హీరోయిన్లు పెద్ద రచ్చ చేస్తుంటే.. ఈ హీరోయిన్ మాత్రం కేవలం వర్క్ షాప్ కోసమే 14 గంటలు కేటాయించడం విశేషం. ఇక తన టీం గురించి చెబుతూ డైరెక్టర్ వినయ్ మీద ప్రశంసలు కురిపించింది. ఎంతో గొప్పగా తమకు వర్క్ షాప్ నిర్వహించారని, ప్రతీ చిన్న ఎమోషన్‌ను డీటైలింగ్‌గా వివరించారని, ఆయన్నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను అంటూ ఐశ్వర్ మీనన్ చెప్పుకొచ్చింది.
లేట్ నైట్ ముచ్చట్లు పెట్టుకుని మళ్లీ ఉదయం 6: 20 గంటలకే నిద్ర లేపే నా రూం మేట్ ఆకర్షిత్ అరోరాకు థాంక్స్.. స్వర భాస్కర్ చాలా టాలెంటెడ్ పర్సన్ అంటూ ఇలా ఆది శక్తి థియేటర్లో నిర్వహించిన వర్క్ షాప్ గురించి ఐశ్వర్ మీనన్ తెలిపింది. అయితే ఇది ఏ ప్రాజెక్ట్ కోసమన్నది మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.