• May 11, 2023

Ari: ‘అరి’కి ఇస్కాన్‌ ప్రశంసలు జయశంకర్‌ సినిమాకు అరుదైన గౌరవం

Ari: ‘అరి’కి ఇస్కాన్‌ ప్రశంసలు జయశంకర్‌ సినిమాకు అరుదైన గౌరవం

    Ari: `పేప‌ర్ బాయ్‌`లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత జయశంకర్‌ తెరకెక్కిస్తున్న రెండో చిత్రం ‘అరి’. అనసూయ, ఆమని, సాయికుమార్, ‘శుభలేఖ’ సుధాకర్, వైవా హర్ష తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఆర్వీ రెడ్డి సమర్పణలో శేషు మారం రెడ్డి, శ్రీనివాస్‌ రామిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. వైవిధ్యమైన కాన్సెప్ట్ తో అందరినీ ఆకట్టుకునే అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు.

    ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, మంగ్లీ ఆలపించిన పాటతో పాటు ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌పై ది ఇంటర్నేషనల్‌ సొసైటీ ఫర్‌ కృష్ణ కాన్సియస్‌నెస్‌( ఇస్కాన్‌) బెంగళూరు ప్రెసిడెంట్‌ మధు పండిత్‌ దాస ప్రశంసలు కురిపించారు. శ్రీకృష్ణుడి జీవిత వైవిధ్యం గురించి ఈ సినిమాలో ప్రస్తావించడంపై అభినందనలు తెలిపారు.


    గతంలోనూ ఈ మూవీ ట్రైలర్‌పై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌తో పాటు ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ సైతం ప్రశంసలు కురిపించారు.

    ఇక ఈ సినిమాలో కృష్ణతత్వం తేలియజేసే ‘చిన్నారి కిట్టయ్య’పాటని హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ ప్రెసిడెంట్ శ్రీ సత్య గౌరవ్ చంద్రదాస్ విడుదల చేశారు. మంగ్లీ ఆలపించిన ఆ పాటకు అద్భుతమైన స్పందన లభించింది. మొత్తంగా విడుదలకు ముందే ‘అరి’ చిత్రంపై పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయింది.