• December 22, 2022

మణి శంకర్ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ఆడియో లాంచ్ ఈవెంట్‌లో మురళీ మోహన్

మణి శంకర్ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ఆడియో లాంచ్ ఈవెంట్‌లో మురళీ మోహన్

  శివ కంఠమనేని, సంజ‌న గ‌ల్రాని, ప్రియా హెగ్దే, చాణ‌క్య ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తోన్న చిత్రం “మణిశంకర్”. డ‌బ్బు చుట్టూ తిరిగే ఒక ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌-క‌థ‌నాల‌తో యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఒక డిఫ‌రెంట్ మూవీగా తెర‌కెక్కింది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ భాద్య‌త‌ల్ని జి.వి.కె(జి. వెంక‌ట్‌ కృష్ట‌ణ్‌) నిర్వ‌హించారు. లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ ప‌తాకంపై కె.ఎస్. శంకర్ రావు, ఆచార్య శ్రీ‌నివాస‌రావు, ఎం. ఫణిభూషణ్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్ప‌టికే ఈ మూవీ నుండి విడుద‌లైన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కి మంచి స్పంద‌న ల‌భించింది. తాజాగా ఈ చిత్రయూనిట్ ఆడియో లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ప్ర‌ముఖ న‌టులు మురళీ మోహన్, ప్ర‌ముఖ నిర్మాత సి. క‌ళ్యాణ్, న‌టులు అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా మ‌ణిశంక‌ర్ బిగ్ ఆడియో సీడీని వీఐపీ ప్రైమ్‌ సీఈవో సతీష్‌ రెడ్డి ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా..

  మురళీ మోహన్ మాట్లాడుతూ.. ‘మేం అంతా కూడా రియల్ ఎస్టేట్‌లో భాగస్వామ్యులం. శంకర్ గారు తీసిన మణిశంకర్ సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను. శివ కంఠమనేని హీరోగా, నిర్మాతగా వస్తుండటం గర్వంగా ఉంది. అశోక్ గారు, కళ్యాణ్ గారు ఇండస్ట్రీలో పెద్దవారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా కళ్యాణ్ గారు అందుబాటులో ఉంటారు. సంజన గారితో ఎన్నో సినిమాలు కలిసి న‌టించాను. ఈ సినిమా ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తోంది. ట్రైలర్ చూస్తుంటే డబ్బు చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని తెలుస్తోంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

  ప్ర‌ముఖ నిర్మాత సీ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘తండ్రి ఇష్టాలను తెలుసుకుని, వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్న శంకర్ కొడుకుల‌కి థాంక్స్. ప్రతీ సినిమాకు నాతో క్లాప్ కొట్టిస్తారు. మాది ఎన్నో ఏళ్ల స్నేహబంధం. వల్లభనేని జనార్థన్ ఇంటి నుంచే మేం అంతా వచ్చాం. ఆయన ఆరోగ్యం బాగుండాలని మేం మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. శివ నటనను చూసి నేను ఆశ్చర్యపోయాను. కానీ రియల్ ఎస్టేట్‌లో ఎక్కువగా బిజీగా ఉంటాడు. ఇప్పుడు కూడా మంచి చిత్రంతోనే వస్తున్నాడని అనుకుంటున్నాను. ఈ సినిమా విజయవంతం అవ్వాలి. మంచి హిట్ అయి ఇంకో పది సినిమాలు తీయాలని అనుకుంటాడు. ఈ సంస్థ ప్రతీ నెలా ఈ సంస్థ‌ రెండొందల మందికి భోజనం పెడుతూ ఉండాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

  వీఐపీ ప్రైమ్‌ సీఈవో సతీష్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘మణిశంకర్ కథను డైరెక్టర్ నాకు చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే ముందు నేను అంతగా పట్టించుకోలేదు. సినిమా చూపించండని అడిగాను. మణిశంకర్ సినిమాను అద్భుతంగా తీశారు. స్ట్రీమింగ్ తరువాత చూసుకుందాం.. అవుట్ రైట్‌గా ఎంతకిస్తారు? అని అడిగాను. సంక్రాంతికి ఈ సినిమా రాబోతోంది. నేరుగా ఓటీటీకి ఓ సినిమాను కొన్నామంటే అందులో ఎంత డెప్త్ ఉందో అర్థం చేసుకోండి. ఓటీటీ సంస్థలేవీ కూడా నిర్మాతల నుంచి డబ్బులను ఆశించదు. సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడూ ఓటీటీ సంస్థలు సాయం చేస్తూనే ఉంటాయి. నేను కూడా మన తెలుగు ఇండస్ట్రీకి సాయంగా ఉంటాను. నేను కూడా ఓ చైల్డ్ ఆర్టిస్ట్‌ని. రేపటి పౌరులు సినిమాలో నటించాను. కన్నడలో హీరోగా ఓ సినిమాను కూడా చేశాను. సచిన్ జోషి హీరోగా మౌనమేలనోయి సినిమాను నిర్మించాను. మంచి సినిమాలకు నేను ఎప్పుడూ అండగా ఉంటాను’ అని అన్నారు.

  హీరో శివ కంఠమనేని మాట్లాడుతూ.. “మ‌ణిశంక‌ర్ మంచి కాన్సెప్ట్ తో తెర‌కెక్కింది. నా ఫ్రెండ్స్ శ్రీనివాస్, ఫణి భూషణ్‌ల సాయంతో సినిమాను నిర్మించాను. ద‌ర్శకుడు జీవీకే మంచి విజ‌న్ తో చిత్రాన్ని రూపొందించారు. ఇళయరాజా శిష్యుడు ఎం ఎల్ రాజా మా సినిమాకు మంచి సంగీతం అందించాడు. మా డీఓపీ జేపీ గారుఎంతో సహకరించారు. నటీనటులంతా కూడా అద్భుతంగా నటించారు“ అన్నారు.

  డైరెక్టర్ జి. వెంక‌ట్‌ కృష్ట‌ణ్‌ మాట్లాడుతూ.. ‘శంకర్‌గారు కథ విన్న వెంటనే సోల్ పట్టేసుకున్నారు. సంజన గారు పోషించిన పాత్రలోనూ చాలా డైమన్షన్స్ ఉన్నాయ్.. అందుకే ఆమెను ఆ కారెక్టర్ కోసం అడిగాం. ప్రియా హెగ్దే, చాణ‌క్యలు పోషించిన పాత్రలు కూడా బాగుంటాయి. సినిమా కోసం ప్రతీ ఒక్కరూ కష్టపడి పని చేశారు. జనవరి మొదటి వారంలో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం.’ అని అన్నారు.

  సంజన గల్రానీ మాట్లాడుతూ.. ‘కరోనా తరువాత నాకు ఈ ఆఫర్ వచ్చింది. శివ కంఠమనేని, బాబి గారికి థాంక్స్. శివ కంఠమనేని గారికి సినిమా అంటే ఎంతో ప్యాషన్. చక్కగా నటించారు. ఆయన ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. ప్రభాకర్ రెడ్డి గారితో పని చేయడం ఆనందంగా ఉంది. మా నిర్మాతలు చాలా మంచి వారు. చక్కటి ప్లానింగ్‌తో సినిమాను నిర్మించారు. ఈ చిత్రయూనిట్‌తో పని చేయడం నాకు ఆనందంగా ఉంది. సినిమాకు మీకు నచ్చితే అందరూ మాకు సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

  ఈ కార్య‌క్ర‌మంలో సినిమాటోగ్రాఫ‌ర్ జే ప్రభాక‌ర్ రెడ్డి, సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎల్ రాజ త‌దిత‌రులు పాల్గొని ప్ర‌సంగించారు.

  సాంకేతిక వ‌ర్గం:
  క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: జి. వెంక‌ట్ కృష్ణ‌న్ (జీవికే)
  నిర్మాత‌లు: కె.ఎస్.శంకర్ రావు, ఆచార్య శ్రీ‌నివాస‌రావు, ఎం. ఫణి భూషణ్
  బ్యాన‌ర్‌: లైట్ హౌస్ సినీ క్రియేషన్స్
  సినిమాటోగ్ర‌ఫి: జె. ప్ర‌భాక‌ర్ రెడ్డి
  సంగీతం: ఎం.ఎల్.రాజా
  ఎడిట‌ర్‌: స‌త్య గిదుటూరి
  ఆర్ట్‌: షేరా
  ఫైట్స్‌: వింగ్‌చున్ అంజీ
  లిరిక్స్‌: పేదాడ మూర్తి
  ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్: ఎం.కె బాబు
  పీఆర్ఓ: సిద్ధు.