• January 17, 2024

అనిల్ కుమార్ ఉపాధ్యాయుల డిజైన్ చేసిన మెగాస్టార్ చిరంజీవి “విశ్వంభర” టైటిల్ కాన్సెప్ట్ వీడియోకు హ్యూజ్ రెస్పాన్స్

అనిల్ కుమార్ ఉపాధ్యాయుల డిజైన్ చేసిన మెగాస్టార్ చిరంజీవి “విశ్వంభర” టైటిల్ కాన్సెప్ట్ వీడియోకు హ్యూజ్ రెస్పాన్స్

    మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రెస్టీజియస్ సోషియో ఫాంటసీ మూవీ “విశ్వంభర” టైటిల్ కాన్సెప్ట్ వీడియో రిలీజై హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. టైటిల్ కాన్సెప్ట్ వీడియో బాగుందంటూ ఆడియెన్స్, మెగాభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఈ కాన్సెప్ట్ వీడియోలోని గ్రాఫిక్స్, కాన్సెప్ట్ గురించి అందరిలో చర్చ జరుగుతోంది.

    ఈ టైటిల్ కాన్సెప్ట్ వీడియోను డిజైన్ చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు అనిల్ కుమార్ ఉపాధ్యాయుల. అసోసియేట్ డైరెక్టర్ గా యూవీ క్రియేషన్స్ సంస్థలో పలు సినిమాలకు పనిచేశారు అనిల్ కుమార్ ఉపాధ్యాయుల. రెబెల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమాతో పాటు రాధే శ్యామ్ కు అనిల్ కుమార్ వర్క్ చేశారు. రాధే శ్యామ్ సినిమాలోని నీ రాతలే పాటకు కాన్సెప్ట్ డిజైన్ చేసి పిక్చరైజ్ చేశారు అనిల్ కుమార్ ఉపాధ్యాయుల.

    త్వరలో యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో అఖిల్ అక్కినేని హీరోగా ఓ భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా సినిమాను తెరకెక్కించబోతున్నారు అనిల్ కుమార్ ఉపాధ్యాయుల. ఈ సినిమాతో అనిల్ కుమార్ డైరెక్టర్ గా గ్రాండ్ డెబ్యూ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిన ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది. అనిల్ కుమార్ ఉపాధ్యాయుల క్రియేటివ్ వర్క్ చూస్తుంటే ఆయన టాలీవుడ్ లో మరో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకుంటాడని ఆశించవచ్చు.