Hari Hara Veera Mallu సినిమా ఆగిపోయిందని, పక్కన పడేశారంటూ గత కొన్నిరోజులుగా రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. క్రిష్ చెప్పిన కథ, రాసిన స్క్రిప్ట్ పవన్ కళ్యాణ్ మార్పులు సూచించారని, నిర్మాత దర్శకుడు హీరోలకు మధ్య చర్చలు జరిగాయని, అలా ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశారంటూ పిచ్చి వార్తలన్నీ బయటకు వచ్చాయి.
అయితే తాజాగా హరి హర వీర మల్లు సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ వచ్చింది. ఆగస్ట్ నెలలో ఈ మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతోందట. ఈ మేరకు నెట్టింట్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా అర్జున్ రాంపాల్ అనే నటుడు తెలుగులోకి రాబోతోన్నాడట. ఆగస్ట్ రెండో వారంలోనే ఈ మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.
మొత్తానికి పవన్ కళ్యాణ్ మళ్లీ తన సినిమాలతో బిజీ కానున్నాడు. ఈ సినిమాతో పాటు వరుసగా లైన్‌లో పెట్టేశాడు పవన్ కళ్యాణ్. వినోదయ సిత్తం రీమేక్, హరీష్ శంకర్ చిత్రాలు ఇప్పటికి ఫైనలైజ్ అయి ఉన్నాయి. ఇక హరీష్ శంకర్ అయితే పవర్ స్టార్ కోసం మరో కమర్షియల్ సినిమాను రెడీ చేశాడు. ఇప్పటికే ఓ డైలాగ్ కూడా లీక్ చేసేసిన సంగతి తెలిసిందే.
Ram Pothineni: ఫ్లాప్ వచ్చినా కూడా తగ్గించడం లేదే.. రామ్ రెమ్యూనరేషన్‌పై చర్చ
Tollywood Producers: రోగానికి, చిక్సితకు సంబంధం లేదు!.. టాలీవుడ్ నిర్మాతల తెలివి ఎటు పోయింది?