• July 27, 2022

HBD Sai Kumar : కనిపించని ఆ నాలుగో సింహం బర్త్ డే.. చిరు మెచ్చుకున్న వేళ

HBD Sai Kumar : కనిపించని ఆ నాలుగో సింహం బర్త్ డే.. చిరు మెచ్చుకున్న వేళ

    HBD Sai Kumar టాలీవుడ్‌లోనే కాకుండా సాయి కుమార్ సినీ కెరీర్‌లోనూ పోలీస్ స్టోరీ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. కన్నడలో తీసిన ఈ సినిమాను తెలుగు నాట కూడా విడుదల చేస్తే బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. థ్రిల్లర్ మంజు టేకింగ్, యాక్షన్.. సాయి కుమార్ పర్ఫామెన్స్ ఈ సినిమాను ఓ స్థాయిలో నిలబెట్టేశాయి. ఇక ఈ సినిమాను తెలుగులో విడుదల చేసేందుకు ఆయన పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. నేడు(జూలై 27) ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం.

    సాయి కుమార్ అంటే.. మనకు ఆ ఖాకీ చొక్కా.. పవర్ ఫుల్ డైలాగ్స్.. కనిపించని ఆ నాలుగో సింహమేరా అగ్ని అగ్ని అంటూ ఆగ్రహావేశాలతో చెప్పే డైలాగ్స్ గుర్తుకు వస్తుంటాయి. అయితే ఈ సినిమా తెలుగులోకి రావడానికి తెర వెనుక పెద్ద కథే జరిగింది. చిరంజీవి ఈ సినిమా గురించి ఓ బైట్ ఇస్తే అంతా సెట్ అవుతుందని సాయి కుమార్ భావించాడట.

    చిరంజీవికి ఈ సినిమాను చూపించేందుకు సాయి కుమార్ ఎన్నో కష్టాలు పడ్డాడు. ఉన్న ఒకే ఒక ప్రింట్‌ను అక్కడికి ఇక్కడికి మార్చుతూ చిరంజీవికి ఈ సినిమాను చూపించాడు. మొత్తానికి ఈ సినిమా చిరంజీవి బాగా నచ్చేసింది. థియేటర్లోనే చిరు ఎమోషనల్ అయ్యాడు. సాయి కుమార్‌ను గట్టిగా పట్టుకుని, హగ్ చేసుకుని కన్నీళ్లు కూడా పెట్టేశాడు.

    అలా మొత్తానికి అగ్ని పాత్రకు సాయి కుమార్ ఊపిరి పోశాడు. ఇక నటుడిగా, హీరోగా సాయి కుమార్ ఎన్నో ఎత్తులు చూశాడు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ సాయి కుమార్ ఎంతో ఫేమస్. తెలుగు, తమిళం, కన్నడలోనూ సాయి కుమార్ ఫాలోయింగ్ ఉంది. రజనీకాంత్‌కు సైతం సాయి కుమార్ డబ్బింగ్ చెప్పేశాడు. సాయి కుమార్ ఇప్పుడు అతిథి పాత్రలు చేస్తున్నాడు.

    విలన్‌గా ఎవడు సినిమాలో అదరగొట్టేశాడు. ఇక తన కుమారుడు ఆది సాయి కుమార్‌తో కలిసి కొన్ని సినిమాలు చేశాడు. ఆదిని హీరోగా నిలబెట్టేందుకు చాలానే ప్రయత్నిస్తున్నాడు. మొత్తానికి ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాలో సాయి కుమార్ మళ్లీ మెప్పించాడు. అయితే ఇప్పుడు బుల్లితెరపై వావ్ అనే షోతో అందరినీ అలరిస్తున్నాడు. ఇలానే ఇంకా మున్ముందు తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ఉండాలని A2Z ADDA మనస్పూర్తిగా కోరుకుంటోంది.