• October 29, 2021

Guppedantha Manasu Episode 281: ఆ ఉంగరేమే కొంప ముంచుతుందా? వసుధారకు రిషి దూరం

Guppedantha Manasu Episode 281: ఆ ఉంగరేమే కొంప ముంచుతుందా? వసుధారకు రిషి దూరం

    మనసులో ఉన్న ప్రేమను గుర్తించకపోవడం, దాన్ని బయటకు చెప్పుకోలేకపోవడంతో వచ్చే సమస్యలు, బాధలను రిషి రూపంలో గుప్పెడంత మనసు సీరియల్‌లో చూపిస్తున్నారు. మొత్తానికి ఒళ్లంతా ఇగో ఉన్న రిషి.. తనలో ఉన్న ప్రేమను గుర్తించుకోలేకపోతోన్నాడు. ఇక నేడు అంటే అక్టోబర్ 29న ప్రసారం కానున్న గుప్పెడంత మనసు 281 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం.

    వసుధార మాటలను తలుచుకుంటూ రిషి తెగ మథన పడిపోతాడు. తనలో తాను కుమిలిపోతాడు. గతంలో సాక్షి కూడా ఇలానే వచ్చింది.. చదువు కోసం మని చెప్పి వెళ్లిపోయిందని గుర్తు చేసుకుంటాడు. ఇక రిషి అలా ఉండటం చూసి వదిన వచ్చి అడుగుతుంది. ఏం జరిగింది రిషి? అని అడుగుతుంది. అసలు విషయం చెప్పకుండా వేదాంతం వల్లిస్తాడు. నమ్మకం మీద నమ్మకం పోతోంది.. మనషుల్ని నమ్మాలంటే భయంగా ఉంది.. జీవితం అంటే ప్రయాణం వంటిది.. రైలు ప్రయాణంలో మనం ఎంతో మందిని కలుస్తాం.. మధ్యలోనే వెళ్లిపోతారు.. అప్పుడు సాక్షి ఇప్పుడు వసు అని చెప్పబోతాడు. కానీ పూర్తిగా చెప్పడు.

    దీంతో రిషి వదిన మళ్లీ అడుగుతుంది. ఎవరు వెళ్తున్నారు రిషి అంటే చెప్పడు. ఎవరి గురించి మాట్లాడుతున్నావో చెబితే.. అని వదిన అంటుంది. నాకు క్లారిటీగానే ఉందని చెబుతాడు. వసుధార గురించి రిషి బాధపడుతున్నాడా? అని ఆమె అనుకుంటుంది. ఇంకా రిషి మాట్లడుతూ.. మన జీవితంలోకి ఎవరెవరో వస్తారు.. ఏదేదో చెబుతారు.. మనం ఏదేదో అనుకుంటాం.. ఏదేదో చేస్తారు.. కొందరిని మనం ఆపలేం.. ఎవరికి తోచింది వారు చేస్తారు.. అని రిషి చెబుతుంటాడు.

    మన మనసులో ఏమున్నదో చెబితేనే కదా? ఎదుటి వాళ్లకు అర్థమవుతుంది అని ఆ వదిన అంటుంది. అయితే దానికి కూడా సమాధానం చెబుతాడు రిషి. మన మనసులో ఏమున్నదనే దాని కంటే ఎదుటి వారి మనసులో ఏమున్నదనేది కూడా ముఖ్యం అని అంటాడు. ఇక అక్కడ సీన్ కట్ చేస్తే జగతి, వసుల మీద ఓపెన్ అవుతుంది. నిశ్చితార్థం కూడా అంతా రెడీ చేస్తుంటారు. ఇంతలోపు శిరీష్ తనకు కాబోయే శ్రీమతి అమూల్యను పరిచయం చేస్తాడు.

    అమూల్య వసు శిరీష్ ముచ్చట్లు పెట్టుకుంటారు. నేను నీకు ఆడపడచును కాదు.. హాఫ్ హాస్బెండ్ అంటూ అమూల్యను ఆట పట్టిస్తుంటే.. వసును శిరీష్ ఆపుతాడు. అలా జగతి మేడంతో తనకున్న బంధం గురించి అమూల్యకు శిరీష్ చెబుతాడు. మీరు చేస్తున్న సాయం మరువ లేను..మీకు కూడా మంచి కోడలు వస్తుంది అని జగతిని ఉద్దేశించి అమూల్య అంటుంది. దీంతో జగతి కాస్త ఎమోషనల్ అవుతుంది.

    అలా అక్కడ సీన్ కట్ చేస్తే రిషి మథన పడటం, వసు మాటలను గుర్తుకు చేసుకుంటూ కుమిలిపోవడాన్ని చూపిస్తారు. కానీ రిషి మాత్రం తనలో ఉన్న ప్రేమను మాత్రం బయటపెట్టడం లేదు. తెల్ల కాగితం లాంటితన జీవితంలోకి వచ్చావ్.. జ్ఞాపకాలే మన ఆస్తులు అన్నావ్.. నిజంగానే జ్ఞాపకాలే నిజమైన సంపది అని ఇప్పుడు అనిపిస్తోంది.. నీకు ఎంగేజ్మెంట్ అంటే నేను ఎందుకు ఫీల్ అవుతున్నాను.. నువ్వేదో నా ప్రాపర్టీ అయినట్టు నేను ఎందుకు బాధపడుతున్నాను.. భయం అడ్డు వచ్చిందా? గౌరవం వచ్చిందా?.. కోపానికి భయపడతాను అన్నావ్.. నా మీదున్న భయం.. ఇంత పని చేస్తుందని నేను అనుకోలేదు.. అంటూ ఇలా రిషి తనలో తాను వసు ఆలోచనలతో సతమతమవుతున్నాడు.

    రిషి బ్యాగ్ సర్దుకోవడం చూసిన మహేంద్ర ఆశ్చర్యపోతాడు. ఎక్కడికి వెళ్తున్నావ్? ఎందుకు వెళ్తున్నావ్? నచ్చంది జరిగితే ఆపొచ్చు కదా? అంటూ ఇలా ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. కలుపుకుంటేను బంధాలు కలుస్తాయ్ అంటూ మహేంద్ర సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తాడు.కానీ రిషి మాత్రం వినడు. జరిగేది శిరీష్ వసుధార ఎంగేజ్మెంట్ అన్న కోపంలోనే ఉంటాడు. వచ్చి చూస్తే అసలు విషయం అర్థమవుతుందనేది మహేంద్ర అభిప్రాయం.

    కానీ రిషీ మాత్రం ఎక్కడికో వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు. అయితే రేపటి ఎపిసోడ్‌లో మాత్రం రిషి ఆ ఎంగేజ్మెంట్‌కు వచ్చినట్టు కనిపిస్తోంది. అక్కడ వసు చీరలో ఉండటం, జగతి మేడం ఇచ్చిన రింగును వేలికి చూడటంతో మన రిషి ఇంకా పొరబాటు పడేట్టు కనిపిస్తోంది. మొత్తానికి రిషి మాత్రం తనలోని ప్రేమను తానే గుర్తించక, అది వసుకు చెప్పలేక ఇంకెన్నాళ్లు భారాన్ని మోస్తాడో చూడాలి.

    Leave a Reply