- November 1, 2021
Guppedantha Manasu Episode 283 : వసుతో అదిరిపోయే సీన్.. కానీ అంతలోనే రిషి అలా

గుప్పెడంత మనసు సీరియల్ సోమవారం నాడు మంచి ఎమోషనల్ టచ్ ఇవ్వనుంది. రిషి మళ్లీ వచ్చాడు అని హారన్ శబ్దంతో వసుకి తెలిసిపోతుంది. రిషి కోసం పరుపరుగునా వెళ్తుంది. కానీ అంతలోపే రిషి వెళ్లిపోతాడు.. అక్కడ ఎవ్వరూ ఉండరు. వసు అలా పరిగెత్తడం చూసి జగతి కంగారు పడుతుంది. ఏం జరిగిందంటే.. రిషి సార్ కారు హారన్ వినిపించింది.. వచ్చాడేమో అని అంటుంది. మళ్లీ ఎందుకు వస్తాడు.. ఆల్రెడీ వచ్చి వెళ్లాడని చెప్పావ్ కదా? అని అంటుంది.
అలా సీన్ కట్ చేస్తే రిషి ఇంట్లోకి వస్తాడు. అప్పటికే వదిన ధరణి రిషిని అన్నం తింటావా? అని అడుగుతుంది. కానీ రిషి మనసు బాగా లేకపోవడంతో తినని చెబుతాడు. అదే విషయాన్ని మహేంద్రకు ధరణి ఫోన్ చేసి చెబుతుంది. అంతలోపే రిషి పెద్దమ్మ అక్కడికి వచ్చి ధరణిని తిడుతుంది. నాకు చెప్పాలి కదా? అంటూ విసుక్కుంటుంది. అయితే రిషి వద్దకు భోజనం తీసుకెళ్లినా తినడు. అలా సీన్ కట్ చేస్తే.. వసు కూడా అదే పరిస్థితిలో ఉంటుంది.
రిషి గురించి ఆలోచిస్తూ వసు తెగ మథన పడుతూ ఉంటుంది. ఎందుకు వచ్చారు.. ఎందుకు వెళ్లారు అంటూ ఆలోచిస్తూ ఉండగా జగతి వస్తుంది. ఎందుకు అంత ధీర్ఘంగా ఆలోచిస్తున్నావ్.. అని జగతి అంటే..రిషి సర్ వచ్చాడు మేడం అని వసు అంటుంది.వస్తే వచ్చాడు.. అయితే ఏంటి.. అసలు నవ్ ఈ మధ్యను చదువు మీద కాకుండా వేరే వాటి మీద దృష్టి పెడుతున్నావ్.. కొన్ని ఆలోచించాలి.. కొన్ని ఆలోచించకూడదు.. అప్పుడే ప్రశాంతంగా ఉంటావ్..రా భోజనం చేద్దాం అని వసును తీసుకెళ్లింది జగతి.
ఇక మరో వైపు రిషి ఇంకా భోజనం చేయడు. మహేంద్ర వచ్చి గోరు ముద్దలు తినిపిస్తాడు. మనసులోని విషయం బయటపెడతాడేమో అని చాలా రకాలుగా అడిగి చూస్తాడు మహేంద్ర. కానీ రిషి మాత్రం అస్సలు బయటపడడు. మీ దగ్గర నాకు దాపరికాలు ఏంటి.. సమయం వచ్చినప్పుడు చెబుతాను అంటాడు కానీ ఆ టెన్షన్స్ ఏంటన్నవి మాత్రం చెప్పడు. ఎప్పుడు బయటపడతావ్ రా.. బయట పడే వరకు వదలను రా అంటూ మహేంద్ర తనలో తాను అనుకుంటాడు.
ఇక సీన్ కట్ చేస్తే ఉదయాన్నే కాలేజ్‌కు వెళ్లిన రిషి.. అమ్మాయిలను చూస్తాడు. అందులో వసును చూసుకుంటూ అలానే ఉండిపోతాడు. మహేంద్ర వచ్చి అడిగితే ఏదేదో చెబుతాడు. అమ్మాయిలను చూస్తున్నాను.. వారు అద్భుతం.. వారి మనసులు, ఆలోచనలు అద్భుతం.. అన్నీ తెలుసు అనుకుంటారు.. కానీ ఏం తెలియదు.. అవగాహన అస్సలు ఉండవు.. నిర్ణయాలు తీసుకోవడం, జీవితాన్ని నిర్మించుకోవడం ఏదీ తెలియదు.. ఎప్పుడు ఏది తోస్తే అదే చేస్తారు.. అప్పుడ సాక్షి ఇప్పుడు అని మధ్యలోనే ఆగిపోతాడు రిషి. ఏంటో చెప్పరా? అని మహేంద్ర అన్నా కూడా చెప్పడు.
అదే సమయానికి జగతి, వసు కూడా వస్తారు. రిషికి గుడ్ మార్నింగ్ చెప్పినా కూడా వసును పట్టించుకోడు. రిషి సర్ ఎందుకు అలా ఉన్నారు.. గుడ్ మార్నింగ్ చెప్పినా కూడా పట్టించుకోలేదు అని మహేంద్రతో వసు అంటుంది. క్లాస్ టైం అవుతుందేమో అందుకే అలా ఉన్నాడని అంటే.. మీరు కూడా సార్‌కే సపోర్ట్ చేస్తారా? అని వసు ఫీలైంది.
ఆ తరువాత జగతి, మహేంద్రలు మాట్లాడుకున్నారు. రిషి రీసెర్చ్ చేస్తున్నాడంటూ.. లెక్కలో జీవితం, జీవితంలో లెక్కలు అంటూ ఏదో కామెడీ చేశాడు. రిషి రీసెర్చ్ చేస్తుంటే.. మీరు సాయం చేయోచ్చు కదా? అని జగతి..నేను చేసే సాయం ఎవ్వరికీ కనపడదు అంటూ మహేంద్ర చెబుతాడు. అలా ఎసిసోడ్ ముగుస్తుంది.
కానీ రేపు మాత్రం అదిరిపోయే సీన్ పడనున్నట్టు కనిపిస్తోంది. రిషితో మాట్లాడేందుకు తన కాబిన్‌కు వసు వెళ్లినట్టుంది. వెళ్లండి అని రిషి.. వెళ్లండా? ఇక్కడ ఇంక ఎవరు ఉన్నారు అని వసు అనడం.. కోపంతో రిషి తన పెన్నును టేబుల్‌పై కొట్టడం.. అది వెళ్లి వసుకు తగలడంతో రిషి కంగారు పడతాడు. దగ్గరకు వెళ్లి కంటి మీద తగిని గాయాన్ని చూస్తాడు. కానీ అంతలోపు వసు చేతికి ఉన్న ఉంగరాన్ని చూసి వెనక్కి వస్తాడు.. నాకు నచ్చని నిర్ణయాన్ని తీసుకున్నావ్ అని తనలో తానే రిషి అనుకుంటాడు. మొత్తానికి రేపు మాత్రం ఈ ఇద్దరి మధ్య మంచి ఎమోషనల్ సీన్ పడేలా ఉంది.