• October 30, 2021

Guppedantha Manasu Episode 282 : ఇక రిషి మారడు.. అడగనూ లేడు తెలుసుకోలేనూ లేడు!

Guppedantha Manasu Episode 282 : ఇక రిషి మారడు.. అడగనూ లేడు తెలుసుకోలేనూ లేడు!

    Guppedantha Manasu Episode 282 గుప్పెడంత మనసు సీరియల్ ఇప్పుడు మంచి ప్రేమ కథగా మారింది. మనసులో ఉన్న ప్రేమను గుర్తించలేకపోవడం, దాన్ని బయటకు వ్యక్తీకరించకపోవడం, ప్రేమ, ద్వేషం, బాధ, అసూయ అన్నీ ఒకే చోటకు రావడంతో కథ మంచి ఫాంలోకి వచ్చింది. ఇక రిషికి వసు అంటే ఇష్టం. అది అతనికి కూడా తెలుసు. కానీ ఒప్పుకోలేకపోతున్నాడు. దాన్ని గుర్తించలేకపోతోన్నాడు. ఇక మరో వైపు వసుధార పరిస్థితీ అంతే. ఆమె మనసులో ఏముందో తెలుసుకోలేకపోతోంది. శనివారం నాడు అంటే ఎపిసోడ్ నంబర్ 282లో ఏం జరిగిందంటే..

    శిరీష్ అమూల్య నిశ్చితార్థం పనులు బాగానే జరుగుతాయి. రిషికి ఇలా జరుగుతుంటే.. మేడం సర్‌లు పక్కనే కూర్చుంటే ఎలా ఉంటుందా? అని వసు ఊహల్లోకి వెళ్తుంది. అలానే ఆ తరువాత సీన్లో మహేంద్ర కూడా అలానే ఊహల్లోకి వెళ్తాడు. వసు రిషి ఎంగేజ్మెంట్ జరుగుతున్నట్టుగా ఊహించుకుంటా.

    రాడనుకున్న రిషి ఎంగేజ్మెంట్‌కు వస్తాడు. రిషి వచ్చే సమయంలోనే అమూల్యకు చీర ఇబ్బందిగా ఉందంటే.. జగతి మేడం లోపలకి తీసుకెళ్లింది. అలా రిషి వచ్చే సమయానికి పరిస్థితులు శిరీష్ వసుల నిశ్చితార్థం జరిగినట్టుగా ఉంది. పైగా వసు చేతికి ఉంగరం ఉండనే ఉంది. దాన్ని చూసి మళ్లీ రిషి తన భ్రమల్లోకి వెళ్తాడు. నిశ్చితార్థం అయిందని అనుకుంటాడు. గుమ్మం వరకు వచ్చి మహేంద్ర, శిరీష్ నవ్వుతూ మాట్లాడుకుంటున్న దృశ్యాలను చూసి వెళ్తాడు. తన భార్యను పిలిచినట్టుగా వసుని శిరీష్ పిలవడంతో రిషి కాస్త హర్ట్ అయినట్టున్నాడు.

    అలా చివరకు రిషి గుమ్మం నుంచే వెనుదిరిగి వెళ్తాడు. వసు ఎంత పిలిచినా ఆగలేదు. ఇక అలా ఎందుకు వచ్చాడు. ఎందుకు వెళ్లాడు అనే విషయం ఎవ్వరికీ అర్థం కాదు. కానీ మహేంద్ర మాత్రం అర్థం చేసుకుంటాడు. ఇక నిశ్చితార్థం ముగుస్తుంది.

    ఆతరువాత రిషి ఎక్కడికో వెళ్లి అలా ఒంటరిగా ఉంటాడు. వసు ఇష్టాలు, లక్ష్యాలు, ఆశయాల గురించి ఆలోచిస్తాడు. అంత ధైర్యం ఉన్న వసు ఇలా ఎందుకు చేసింది? జగతి మేడం ఏమైనా ఒత్తిడి చేసిందా? అని అనుకుంటాడు. అప్పుడు అలా ప్లాన్ చేసింది.. ఇప్పుడు ఇలా ప్లాన్ చేసిందా? అంటూ జగతి మేడం గురించి తప్పుగా ఆలోచిస్తాడు. వెళ్లి ఆమెను కడిగేద్దామని అనుకుంటాడు. అలా తిరిగి మళ్లీ నిశ్చితార్థం జరిగే చోటుకు అంటే జగతి మేడం ఇంటికి వెళ్లాడు.

    రిషి సరిగ్గా ఇంటికి వెళ్లే సమయంలో.. శిరీష్ వసు మాట్లాడుకుంటూ సంతోషంగా ఉన్నట్టు కిటికీలోంచి కనిపిస్తుంది. కానీ అసలు సంగతి ఏంటన్నది, అమూల్య, శిరీష్‌లతో వసు మాట్లాడుతోందని రిషికి తెలియదు. శిరీష్ వసు ఎంగేజ్మెంట్ అయిందని, వసు ఆనందంగా ఉందని రిషి వెళ్లిపోతాడు. నీ ఇష్టాన్ని కాదు అని అనడానికి నేను ఎవరినీ అంటూ కారు ఎక్కి వెళ్లిపోయేందుకు సిద్దపడతాడు. అలా కారు ఎక్కి సీటు బెల్టు పెట్టుకుని.. వసు సీట్ బెల్ట్ పెట్టుకో అని అలవాటులో అంటాడు. కానీ పక్కన వసు ధార ఉండదని ఆలస్యంగా గుర్తిస్తాడు. అలా వసు ఆలోచనలతో సతమతమైన రిషి.. కారు హారన్ మీద చేయి వేస్తాడు. కారు హారన్ రావడంతో ఒక్కసారిగా వసు రిషిని చూస్తుంది. ఇక వచ్చే వారం ఏం జరుగుతుందో చూడాలి.

    Leave a Reply