- October 18, 2021
‘గృహలక్ష్మీ’ సీరియల్ గుట్టువిప్పింది.. అందుకే అలా చేస్తోన్నామంటోన్న కస్తూరీ

అన్నమయ్య, భారతీయుడు చిత్రాలతో కస్తూరీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అన్నమయ్యాలో నాగార్జున పక్కన, భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ కూతురిగా కస్తూరీ నటించి మంచి ఆదరణను దక్కించుకుంది. అలాంటి కస్తూరీ పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది. వ్యక్తిగత జీవితంలోని కష్టాలను ఎదుర్కొంటూ సినీ కెరీర్‌కు దూరంగా ఉండిపోయింది. తన భర్త పెద్ద డాక్టర్ అయినా కూడా ఆయన అమెరికా, కస్తూరీ ఇండియాలో ఉంటారు.
ఇక తన పిల్లలకు వచ్చిన కష్టాలను చెబుతూ కస్తూరీ శంకర్ ఆ మధ్య కన్నీరు పెట్టేసుకున్నారు. హాస్పిటల్‌లో మూడు రోజులు ఏం తినకుండా తన పాప కోసం అలానే ఏడుస్తూ ఉన్నాను అంటూ కస్తూరీ ఎమోషనల్ అయింది. అయితే కస్తూరీ శంకర్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేస్తోంది. బుల్లితెరపై ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్‌తో తెలుగు వారిని ఆకట్టుకుంటోంది. తులసి పాత్రలో కస్తూరీ శంకర్ జీవించేస్తోంది. లాస్యగా యాంకర్ ప్రశాంతి, నందు పాత్రలో హరికృష్ణ ఎవరికి వారు నటించేస్తున్నారు.
అయితే ఈ ముగ్గురు కూడా తాజాగా సుమ క్యాష్ షోకు గెస్టుగా వచ్చారు. దానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో సుమ ఓ ప్రశ్న అడిగింది. మీరు మీ భర్తకు విడాకులు ఇచ్చినా కూడా.. ఇంకా ఎందుకు ఒకే ఇంట్లో ఉంటున్నారు? అని కస్తూరీని అడిగింది. రెండో ఇంట్లో ఉందామంటే సీరియల్‌కు బడ్జెట్ లేదు అందుకే ఒకే ఇంట్లో ఉంటున్నామని కస్తూరీ కౌంటర్ వేసింది. అయితే తులసి, లాస్య, నందు అంతా కూడా ఒకే ఇంట్లో ఎందుకు ఉంటున్నారు? అనే ప్రశ్న చూసే ప్రేక్షకులకు కూడా వస్తుంటుంది. కానీ కస్తూరీ వేసిన పంచ్‌కు సుమ షాక్ అయిపోయింది.