• November 22, 2021

Ram Charan Shankar : అన్ని వందల కోట్లా?.. రామ్ చరణ్ శంకర్ ప్రాజెక్ట్‌ రేంజ్ ఇదే

Ram Charan Shankar : అన్ని వందల కోట్లా?.. రామ్ చరణ్ శంకర్ ప్రాజెక్ట్‌ రేంజ్ ఇదే

    రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్‌లో సినిమా అనే వార్త బయటకు వచ్చినప్పుడే అందరి అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. శంకర్ మామూలుగా తెలుగు హీరోలతో సినిమాలు ఇంత వరకు చేయలేదు. తెలుగులో శంకర్‌కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. కానీ ఇంత వరకు కూడా తెలుగు హీరోలతో సినిమాలు చేయలేదు. ఆ మధ్య ఎప్పుడో ఓ సారి చిరంజీవి శంకర్ కాంబోలో సినిమా వస్తుందని రూమర్ చక్కర్లు కొట్టింది. కానీ అది రూమర్‌గానే మిగిలింది.

    అయితే రామ్ చరణ్ శంకర్ ప్రాజెక్ట్ మాత్రం ముందుకు కదిలింది. దిల్ రాజు నిర్మాణంలో 50వ సినిమాగా రూపొందుతుంది. రామ్ చరణ్ 15వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ రాబోతోంది. అయితే ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మొన్నటి వరకు పుణెలో ఓ షెడ్యూల్ పూర్తయింది. ఇక ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ సాంగ్ షూట్ జరుగుతోంది. అది జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో రూపొందతుంది. దీని కోసం అదిరిపోయే సెట్ రెడీ చేశారట.

    అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఒకటి వచ్చింది. ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా జీ స్టూడియో వచ్చింది. అన్ని హక్కులను జీ స్టూడియోస్ చేజిక్కించుకుందని తెలుస్తోంది. దీని కోసం జీ స్టూడియో భారీ మొత్తంలో చెల్లిస్తోందని టాక్. ఆ మొత్తాన్ని చూసి ట్రేడ్ వర్గాలకు సైతం కళ్లు బైర్లు కమ్మాయట. ఆ మొత్తం ఏంటన్నది.. ఏ రేట్ పెట్టి కొన్నారంటూ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    దాదాపు 350 కోట్లతో హక్కులను సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఆడియో హక్కులు, రీమేక్ హక్కులు, ఓవర్సీస్ హక్కులు మాత్రం లెక్కలోకి రాలేదట. అంటే అవన్నీ లేకుండా కేవలం థియేట్రికల్ హక్కుల కోసం అంత మొత్తం పెట్టారా? అంటూ ఈ  మేరకు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి వీటిలో ఎంత నిజమున్నదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.ఈ చిత్రంలో కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తోంది. తమన్ అద్భుతమైన సంగీతాన్ని రెడీ చేశాడట.

    Leave a Reply