• October 26, 2021

RRR టీంకు పెద్ద దెబ్బ.. రెవెన్యూ లెక్కల్లో భారీ మార్పు!

RRR టీంకు పెద్ద దెబ్బ.. రెవెన్యూ లెక్కల్లో భారీ మార్పు!

    ఒకప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇష్టారీతిగా టిక్కెట్ల రేట్లు పెంచుకోవడానికి వీల్లేదు. బెనిఫిట్ షోలు వేసుకుని వీలు లేదు. పైగా జనాలు కూడా ఎగబడి వచ్చే సీన్ లేదు. కరోనా భయం పోయినా కూడా కరోనా వైరస్ మాత్రం పోలేదు. వీటన్నంటిని దృష్టిలో పెట్టుకుని ఆర్ఆర్ఆర్ లెక్కలన్నీ తారుమారు అయ్యాయట. మరీ ముఖ్యంగా ఏపీలోని పరిస్థితులు ఎదురు తిరిగాయి. ఏపీ ప్రభుత్వం సినిమా పరిశ్రమకు కొన్ని నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

    తాజాగా వినిపిస్తున్న లెక్కల ప్రకారం ఏపీలో ఏరియా వారిగా అమ్ముడు పోయిన రేట్లను కుదిస్తున్నారట. ఇంతకు ముందు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా రేట్లు ఫిక్స్ చేశారు. కానీ ప్రస్తుతం అంతా మారింది. దీంతో కొన్ని చోట్ల దాదాపు ముప్పై శాతం తగ్గించారు. ఉదాహరణకు ఈస్ట్ ఏరియాలో 18 కోట్లకు డీల్ సెట్ అయిందట. ఇప్పుడు దీన్ని 13 కోట్ల రూపాయలకు తగ్గించారని తెలుస్తోంది. అలానే ఉత్తరాంధ్రలో 26 కోట్లకు పోగా ఇప్పుడు దాన్ని 19 కోట్ల రూపాయలకు తగ్గించారట.

    మొత్తంగా ఆంధ్ర సీడెడ్‌లో 98 కోట్లకు బిజినెస్ జరిగితే ఇప్పుడు దాన్ని 68 కోట్లకు కుదించినట్టు తెలుస్తోంది. అయితే నైజాం ఏరియాకు ఎలాంటి సమస్యలు లేవు.అయితే ఇది కేవలం ఆర్ఆర్ఆర్ సినిమాపైనే కాదు.. దాదాపు మిగతా అన్ని పెద్ద సినిమాలపై పడింది. పుష్ప, అఖండ, ఆచార్య సినిమాలు కూడా ఇంతకుముందు కుదుర్చుకున్న బిజినెస్ ఒప్పందాల్ని మార్చుకుంటున్నాయట.

    ఆర్ఆర్ఆర్ నిడివి గురించి ఓ చర్చ నడుస్తోంది. దాదాపు మూడు గంటలకు పైగా రన్ టైం వచ్చిందట. కానీ దాన్ని 2 గంటల 45 నిమిషాలకు కుదించారట. ఇక దీపావళికి ఈ సినిమా నుంచి మరో టీజర్ రాబోతోందని టాక్. 29న టీజర్ ఎనౌన్స్ మెంట్ ప్రకటన రానుందని తెలుస్తోంది. దీపావళి టీజర్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రమే ఉంటుందట.. ఎలాంటి డైలాగ్స్ ఉండవని సమాచారం. ఈ మధ్య కాలంలో ఇదొక స్ట్రాటజీగా మారిన సంగతి తెలిసిందే. అన్ని భాషల్లో విడుదల చేయాలంటే ఈ పద్దతినే ఫాలో అవుతున్నారు. ఇక ఈ సినిమా కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులే కాకుండా సగటు సినీ ప్రేమికుడూ ఎదురుచూస్తున్నారు.

    Leave a Reply