• December 26, 2021

హాట్ టాపిక్‌గా రామ్ చరణ్ రెమ్యూనరేషన్.. అసలు నిజమెంత?

హాట్ టాపిక్‌గా రామ్ చరణ్ రెమ్యూనరేషన్.. అసలు నిజమెంత?

    Ram charan Remuneration రామ్ చరణ్ రెమ్యూనరేషన్ ఇంత అంత అంటూ గత రెండు రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ రెమ్యూనరేషన్ లిస్ట్ అంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చింది. అయితే అందులో రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి రెమ్యూనరేషన్లు చూసి అంతా షాక్ అయ్యారు. రామ్ చరణ్, ఎన్టీఆర్‌ల కంటే రాజమౌళి పారితోషికం పెద్ద మొత్తంలో ఉండబోతోందని అర్థమైంది.

    రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు 45 కోట్ల రెమ్యూనరేషన్ దక్కుతోందట. ఇక రాజమౌళికి అయితే ఏకంగా లాభాల్లో 40 శాతం వాటా ఇవ్వాలనే నిబంధనను పెట్టుకున్నాడట. అంటే ఈ లెక్కన వందల కోట్ల రెమ్యూనరేషన్ రాజమౌళి ఖాతాలో పడబోతోందని అర్థమవుతోంది. అయితే ఇక రామ్ చరణ్ ఎన్టీఆర్‌ల రెమ్యూనరేషన్ ఇప్పుడు నెట్టింట్లో చర్చకు దారి తీస్తోంది.

    రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు ప్రస్తుతం 45 కోట్లు తీసుకున్నారట. అయితే రామ్ చరణ్ తన తదుపరి రెండు చిత్రాలకు కలిపి వంద కోట్లు తీసుకున్నట్టు తెలుస్తోంది. అంటే ఆర్ఆర్ఆర్ విడుదల కాక ముందే.. దాని ఫలితం రాకముందే ఇలా రెమ్యూనరేషన్ పెంచినట్టు సమాచారం. దిల్ రాజు శంకర్, గౌతమ్ తిన్ననూని ప్రాజెక్ట్‌ల రెమ్యూనరేషన్‌లు కలిపి వంద కోట్లు అని తెలుస్తోంది.

    మొత్తానికి రామ్ చరణ్ రెమ్యూనరేషన్ మాత్రం ఇప్పుడు నెట్టింట్లో చర్చకు దారి తీస్తోంది. ఇక ఆచార్య సినిమా అయితే సొంత ప్రొడక్షన్ కాబట్టి.. రెమ్యూనరేషన్ కాకుండా లాభాల్లోనే వాటా ఉంటుందని సమాచారం.

    Leave a Reply