- January 22, 2022
ప్రభాస్-మారుతి మూవీ.. ఏకిపారేస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్

Prabhas Maruthi మూవీ అని లీకులు ఎప్పటి నుంచి అయితే బయటకు వచ్చాయో డార్లింగ్ ఫ్యాన్స్ తెగ అసంతృప్తిని వ్యక్త పరుస్తున్నారు. బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లో నటించాల్సిన ప్రభాస్ ఇలా ఓ బీ గ్రేడ్ దర్శకుడితో సినిమా చేయడం ఏంటి? అని డార్లింగ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నీ పెద్ద పెద్ద సినిమాలే కదా? మధ్యలో త్వరగా తొందరగా ఓ సినిమాను పూర్తి చేయాలని మారుతితో ఓ చిత్రం ఓకే చెప్పాడట.
డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తాడట. రాజా డీలక్స్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నారట. దీంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. మరీ ఇంత మంచోడివేంటన్నా? మారుతికి చాన్స్ ఎందుకు ఇచ్చావ్ అన్నా.. నువ్ సినిమా చేయకపోయినా పర్లేదు కానీ మారుతితో చేయకు అన్నా అంటూ అభిమానులు గుండెలు బాదుకుంటున్నారు.
ప్రభాస్‌ను నువ్ హ్యాండిల్ చేయలేవు.. నీకు అవసరమా? అంటూ మారుతిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ సినిమా తేడా కొడితే నువ్ బతకవు అంటూ ఇప్పటి నుంచి ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు. అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా? లేదా? ఇది కేవలం గాలి వార్తేనా? అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే ఈ నేపథ్యంలోనే పాత వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
మహానుభావుడు సినిమా ఈవెంట్‌లో మారుతి చెప్పిన మాటలు వైరల్అవుతోన్నాయి. అది ఎప్పుడు తీస్తానో తెలీదు గానీ.. ప్రభాస్ గారితో ఓసినిమాను కచ్చితంగా చేస్తాను అని మారుతి చెప్పిన మాటలు ఇప్పుడు ట్రెండ్ అవుతోన్నాయి. మొత్తానికి మాట నెరవేర్చుకునేలా ఉన్నాడే అని ఇంకొందరు అంటున్నారు.