- December 19, 2021
‘పుష్ప’కు కత్తెర!.. హమ్మయ్య ఆ ఛండాలపు సీన్ లేపేశారట

సుకుమార్ సినిమా అంటే సకుటుంబ సపరివార సమేతంగా చూడొచ్చనే నమ్మకం ఉండేది అందరికీ. సుకుమార్ ఇంత వరకు తీసిన సినిమాల్లో జగడం మాత్రమే కాస్త భిన్నంగా ఉంటుంది. ఆర్య నుంచి రంగస్థలం వరకు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఎక్కడా వెగటు పుట్టించే సీన్లు పెట్టలేదు. సుకుమార్ ఐటం సాంగ్‌లకు ఎంత ఫేమస్ అయినా కూడా ఏనాడూ హద్దులు దాటలేదు. పైగా అందరూ ఎంజాయ్ చేసేలా ఉండేవి.
కానీ మొదటి సారి సుకుమార్ లెక్కలు తప్పాడు. తనను ఎవరు తప్పు దారి పట్టించారో గానీ సుకుమార్ మాత్రం విమర్శలను ఎదుర్కొంటున్నారు. అసలు ఈ సినిమా పని ఇంకా మిగిలిపోయిందని, ఇలా మధ్యలో ప్రేక్షకుల మీదకు వదిలేశారని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మొత్తానికి ఇప్పుడు కొన్ని నష్టపరిహార చర్యలు ప్రారంభించినట్టు తెలుస్తోంది.
ఈ సినిమాలో చాలా సీన్లు అవసరం లేదు. అందులో ప్రధానంగా రష్మిక, అల్లు అర్జున్‌లు కారులో ఉండి చేసే చేష్టలు అందరికీ వికారంగా అనిపిస్తాయి.రష్మిక మీద బన్నీ చేతులు వేయడం, ఇక రష్మిక వయ్యారాలకు పోయి. ఏంటి సామీ చేతులు వేశావ్.. తీసేయ్ అంటూ ఎక్స్ ట్రాలు చేయడం, ఎంత కవర్ చేసినా కూడా ఆ సీన్ అర్థమేంటో చిన్న పిల్లాడికి కూడా అర్థమయ్యేలా ఉంది.
మొత్తానికి ఆ సీన్ మీద పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. దాన్ని లేపేసినట్టు తెలుస్తోంది. ఇక నేటి నుంచి ఆ సీన్ థియేటర్లో రాకపోవచ్చని టాక్. అదే గనుక నిజమైతే.. కనీసం ఫ్యామిలీ ఆడియెన్స్ కాస్తైనా రిలాక్స్ అవుతూ సినిమాను ఎంజాయ్ చేస్తారు.