• October 27, 2022

గ్లామర్ క్వీన్ & ఎవర్ గ్రీన్ స్టార్ ‘వాణీ విశ్వనాథ్ ‘ విడుదల చేసిన “నటరత్నాలు” ఫస్ట్ లుక్

గ్లామర్ క్వీన్ & ఎవర్ గ్రీన్ స్టార్ ‘వాణీ విశ్వనాథ్ ‘ విడుదల చేసిన “నటరత్నాలు” ఫస్ట్ లుక్

    వివిధ రంగాలలో పనిచేస్తూ సినిమాలను నిర్మించిన వారిని చూశాం. కానీ మొట్ట మొదటి సారిగా చదువుకునే స్టూడెంట్స్ ఓ సినిమా ను నిర్మించడం విశేషం. ఎవరెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మెడిసిన్ స్టూడెంట్ డా. దివ్య, ఎం.బి.ఏ. స్టూడెంట్ ఆనందాసు శ్రీ మణికంఠ నిర్మాతలు గా నిర్మిస్తున్న చిత్రం నటరత్నాలు. ఈ చిత్రానికి డేరింగ్ డైరెక్టర్ నర్రా శివనాగు దర్శకత్వం వహించారు.కామెడీ కింగ్స్ సుదర్శన్, రంగస్థలం మహేష్, అర్జున్ తేజ్ ప్రధాన పాత్ర లో నటించగా రెబల్ డైరెక్టర్ ఏ. ఎస్. రవి కుమార్ చౌదరి, బిగ్ బాస్ 6 లో ప్రేక్షకులను అలరిస్తున్న ఇనయా సుల్తానా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర లలో నటిస్తున్నారు. అర్చన, టైగర్ శేషాద్రి, సుమన్ శెట్టి, విష్ణు వర్ధన్, ఎం. ఎన్. ఆర్. చౌదరి, అట్లూరి ప్రసాద్ లు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. శంకర్ మహదేవ్ సంగీతం అందించగా లిరిక్స్ సీతారామ్ చౌదరి అందించారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం త్వరలోనే ప్రకటించనుంది.

    నటీనటులు

    సుదర్శన్, రంగస్థలం మహేష్, అర్జున్ తేజ్, ఇనయా సుల్తానా, అర్చన, టైగర్ శేషాద్రి, సుమన్ శెట్టి, విష్ణు వర్ధన్, ఎం. ఎన్. ఆర్. చౌదరి, అట్లూరి ప్రసాద్

    సాంకేతిక నిపుణులు

    బ్యానర్ : ఎవరెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్
    నిర్మాతలు : డా. దివ్య, ఆనందాసు శ్రీ మణికంఠ
    డైరెక్టర్ : నర్రా శివనాగు
    సంగీతం : శంకర్ మహదేవ్
    సాహిత్యం : సీతారామ్ చౌదరి
    పీఆర్వో : సాయి సతీష్ , రాంబాబు పర్వతనేని