- November 13, 2021
పూర్తిగా అలా మారిపోయింది.. నిహారికపై గెటప్ శ్రీను కామెంట్స్

గెటప్ శ్రీను ప్రస్తుతం బుల్లితెర, వెండితెరపై ఫుల్ బిజీగా మారాడు. బుల్లితెరపై ఎక్స్ ట్రా జబర్దస్త్, ఇతర షోలు, పండుగ ఈవెంట్లు అంటూ ఫుల్ హల్చల్ చేస్తున్నాడు. ఇక వెండితెరపై హీరోగా కారెక్టర్ ఆర్టిస్ట్‌గా దాదాపు అరడజను సినిమాల్లో నటిస్తున్నాడు. మొత్తానికి గెటప్ శ్రీను మాత్రం ఫుల్ బిజీగా మారిపోయాడు. ఇక ఈ మధ్య ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. నిహారిక నిర్మిస్తోన్న ఓసీఎఫ్ఎస్ (ఒక్క చిన్న ఫ్యామిలీ స్టోరీ) అనే వెబ్ సిరీస్ నిర్మించింది.
ఈ వెబ్ సిరీస్ విడుదలకు సిద్దంగా ఉంది. నవంబర్ 19న జీ 5 యాప్‌లో రాబోతోంది. ఈ మూవీకి సంబంధించిన ఈవెంట్ నిన్న జరిగింది. ఈ ఈవెంట్‌కు వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. అక్కడ గెటప్ శ్రీను, నిహారిక కలిసి ఓ స్కిట్ వేశాడు. బతుకు జట్కా బండి, రచ్చ బండ లాంటి ప్రోగాంను స్కిట్లుగా వేశాడు. అయితే గెటప్ శ్రీను స్పీచ్ ఇస్తూ నిహారిక మీద కామెంట్లు చేశాడు. తనకు ఈ ప్రాజెక్ట్‌లో అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పాడు.
నిహారిక ఇప్పుడూ పూర్తిగా మారిపోయింది. నిర్మాతలా పూర్తిగా మారిపోవడం ఇందాకే చూశాను. స్కిట్లో ఓ చిన్న సంతకం పెట్టండని అంటే చాలా ఆలోచించింది. నిహారిక కొణిదెల అని కాకుండా.. ఏదో పిచ్చి సంతకం పెట్టింది. అంత జాగ్రత్తగా ఉంది. అంటే పూర్తిగా నిర్మాతలా మారిపోయిందని నిహారిక గురించి గెటప్ శ్రీను చెప్పాడు. అయితే నిహారికకు వెబ్ సిరీస్‌లు బాగానే కలిసి వస్తున్నాయి. ముద్దపప్పు ఆవకాయ్, నాన్నకూచి వంటివి బాగానే క్లిక్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ ఓసీఎఫ్ఎస్ ఎలా ఉంటుందో చూడాలి.