• November 9, 2021

అనసూయ ‘ఫ్లాష్ బ్యాక్’.. ఫుల్ జోరు మీదున్న యాంకర్

అనసూయ ‘ఫ్లాష్ బ్యాక్’.. ఫుల్ జోరు మీదున్న యాంకర్

    అనసూయ ఇప్పుడు అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. బుల్లితెరపై అనసూయ బిజీగా ఉంటూనే చకచకా సినిమాలను కూడా లైన్‌లో పెట్టేస్తోంది. తెలుగు, తమిళం అన్ని భాషల్లో ప్రాజెక్ట్‌లను ఓకే చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రభు దేవా, రెజీనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఫ్లాష్ బ్యాక్ చిత్రంలో అనసూయ స్పెషల్ రోల్ పోషించింది. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత, నిర్మాత ఎ.ఎన్ బాలాజీ తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు.

    ఈ సినిమాలో చూపించే ప్రతి సన్నివేశం కూడా సగటు ప్రేక్షకుడి మదిలో ఎప్పటికీ నిలిచిపోతుందని, అన్ని వర్గాల ఆడియన్స్ కెనెక్ట్ అయ్యేలా ఈ మూవీ రూపొందించామని దర్శకనిర్మాతలు చెప్పారు. చిత్రంలో యంగ్ హీరోయిన్ రెజీనా ఓ ఆంగ్లో ఇండియన్ టీచర్‌గా విలక్షణ పాత్ర పోషిస్తుండగా.. అనసూయ ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఈ ఇద్దరి రోల్స్ సినిమాలో మేజర్ అట్రాక్షన్ కానున్నాయి. అనసూయ రోల్ హైలైట్ కానుందని, ప్రభుదేవా క్యారెక్టర్ కొత్తగా ఉంటుందని దర్శకనిర్మాతలు చెప్పారు.

    అయితే తాజాగా ఈ చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించింది. ఈ క్రమంలోనే మొదట అనసూయ తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకునేందుకు రెడీ అయింది. ఈ సందర్భంగా అనసూయ డబ్బింగ్ థియేటర్లో ఫుల్ జోష్ మీదున్నట్టు కనిపిస్తోంది. డబ్బింగ్ ప్రారంభించే ముందు అనసూయ ఫోటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    Leave a Reply