- November 16, 2021
Radhe Shyam : ‘ఈ రాతలే’ అద్బుతం.. లేడీ సింగర్ గాత్రానికి అంతా ఫిదా.. హరిణి విశేషాలివే
రాధే శ్యామ్ సినిమా నుంచి సోమ వారం నాడు విడుడలైన ఈ రాతలే పాట ఇంకా మైండ్లోంచి పోవడం లేదు. ఆ పాట అందరి మైండ్‌లో అలా తిరుగుతూనే ఉంది. లిరికల్ వీడియోలో ఉన్న కాన్సెప్ట్, విజువల్స్ అన్నీ ఒకెత్తు అయితే.. సింగర్లు చేసిన మాయాజాలం వేరే లెవెల్. ఇక యువన్ శంకర్ రాజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు అంతా కూడా హరిణి ఇవటూరి గురించి వెదుకులాట ప్రారంభమైంది. ఆమె గాత్రానికి తెలుగు ప్రేక్షకులంతా కూడా ఫిదా అవుతున్నారు.
హరిణి వాయిస్‌లోని ఆ తీయదనాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఆమె వాయిస్, ఆమె పాడిన లైన్స్‌ను పదే పదే వింటున్నారు. అయితే ఇలా ఒక్కసారిగా హరిణి పేరు నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీంతో ఆమె గురించి వెదుకులాట ప్రారంభించారు. అయితే ఆమె గురించి కొన్ని విశేషాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చిన్నప్పుడు సంగీతం అంటే అంత ఇష్టం ఉండేది కాదని, తన అమ్మ గారికి ఎక్కువ మక్కువట. అయితే చిన్నప్పుడు యూకేజీలోనే సంగీతం క్లాసులో జాయిన్ చేయించారట.
నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి వెళ్లిపోయిందట. అలా మొదలైన తన ప్రయాణంలో ఎన్నో మలుపులు వచ్చాయట. ఎన్నో కాంపిటిషన్స్‌లో సెమీ ఫైనల్స్, ఫైనల్స్ వరకు వెళ్లి వచ్చేదట. పాడుతా తీయగా షోతో తన జీవితం మారిపోయిందని హరిణి చెబుతుంటుంది. ఇక ఆమె తన తోటి సింగర్ సాయి చరణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అలా మొత్తానికి హరిణి ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో ఓ మెలోడీ సాంగ్ ఉంటుంది. కలల కథలా అంటూ సాగే ఆ మెలోడి పాటలోనూ హరిణి వాయిస్ మనందరినీ కట్టిపడేస్తుంది.
హరిణి పాడిన పాటల గురించి గూగుల్ చేస్తున్నారు. స్వరాభిషేకం, పాడుతా తీయగా షోల్లో హరిణి పాడిన పాటలను వెదుకుతున్నారు. ఏది ఏమైనా కూడా ఈ రాతలే అనే పాట ఇప్పుడు అందరి మనసుల్లోకి వెళ్లిపోయింది. ఈ మెలోడీ పాటకు ట్యూన్ ఇచ్చిన జస్టిన్ ప్రభాకరణ్‌కు ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రతీ ఒక్క సంగీత ప్రేక్షకుడు ఫిదా అవుతున్నారు.