• December 4, 2021

Akhanda : అఖండ సినిమా చూస్తూ మరణించిన ఎగ్జిబిటర్!

Akhanda : అఖండ సినిమా చూస్తూ మరణించిన ఎగ్జిబిటర్!

    Akhanda నందమూరి బాలకృష్ణ దెబ్బకు బాక్సులు బద్దలవుతాయి. కానీ ఇలా అభిమానుల గుండెలు కూడా ఒక్కోసారి ఆగిపోతాయి. తాజాగా అఖండ సినిమాను వీక్షిస్తున్న ఓ అభిమాని, ఎగ్జిబిటర్ గుండె ఆగిపోయింది. సినిమా చూస్తుండగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందట. అక్కడే కుప్పకూలి పోయాడట. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మరణించాడట. ఈ ఘటన రాజమండ్రిలో జరిగింది.

    రాజమండ్రిలో సినీ ఎగ్జిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రముఖ సినీ ఎగ్జిబిటర్ జాస్తీ రామకృష్ణ (49) మ‌ృతి చెందారు. గురువారం నాడు శ్యామల థియేటర్లో అఖండ సినిమా చూస్తుండగా ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందట. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు తుది శ్వాస విడిచారట. అయితే సినిమాలోని సౌండ్స్‌కు అలా అయిందా? లేదా మరోమైనా కారణాలున్నాయా? అన్నది తెలియడం లేదు.

    తమన్ కొట్టిన నేపథ్య సంగీతానికి కొన్ని చోట్ల ఆడియో బాక్సుల్లోంచి పొగలు కూడా వస్తున్నాయనంటూ నెట్టింట్లో వీడియోలు, ఫోటోలు వైరల్ కాసాగాయి. ఏది ఏమైనా అఖండ మాత్రం అన్ని చోట్లా దూసుకుపోతోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో రెండు రోజుల్లోనే మిలియన్ మార్క్‌ను క్రాస్ ఔరా అనిపించింది. ఇక ఈ వీకెండ్‌లోపు మిలియన్ మార్కును చేరుకుని అఖండ సంచలనాన్ని సృష్టించేలా ఉంది.

    ఇప్పటికే అఖండ దాదాపు నలభై కోట్ల గ్రాస్ కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు 55 కోట్ల షేర్‌ను సొంతం చేసుకోవాల్సి ఉందట. పోటీలో మరే సినిమా లేకపోవడం కూడా అఖండకు బాగానే కలిసి వచ్చింది.

    Leave a Reply