• February 7, 2023

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఎంగేజింగ్ థ్రిల్లర్ ‘పర్‌ఫ్యూమ్’

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఎంగేజింగ్ థ్రిల్లర్ ‘పర్‌ఫ్యూమ్’

    సినిమా చిత్రీకరణ సమయంలో ఎన్నో విషయాలు జరుగుతుంటాయి. సినిమాను తీసే క్రమంలో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. సినిమాకు టైటిల్ అనేది ఎంతో ముఖ్యంగా ఉంటుంది. కథకు సరిపడా టైటిల్‌ను పట్టుకోవడం కష్టంగా ఉంటుంది. అలా ఇప్పుడు ఓ సినిమా టైటిల్‌ను మేకర్లు మార్చారు. గతంలో ఎవ్వరూ టచ్ చేయని ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొని రూపొందిస్తున్న సినిమాకు ముందుగా వేద అని టైటిల్‌ను ఫిక్స్ చేశారు. కానీ ఈ సినిమా స్మెల్ బేస్డ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌ కావడంతో పర్ఫ్యూమ్ అనేది పర్ఫెక్ట్ టైటిల్ అని మేకర్లు భావించారు. వేద టైటిల్‌ను కాస్తా ‘పర్‌ఫ్యూమ్’ గా మార్చారు.

    డైరెక్టర్ జే.డి. స్వామి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేసిన మేకర్స్.. తాజాగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా కంప్లీట్ చేశారు. ఎంతో గ్రాండ్ గా అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాను రూపొందించామని, నటీనటులతో పాటు టెక్నీషియన్స్ అంతా కూడా ప్రత్యేక శ్రద్ద పెట్టారని అంటున్నారు దర్శకనిర్మాతలు. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తామని మేకర్స్ తెలిపారు.

    ఫ్రాగ్రన్స్ మ్యానిఫెస్టేషన్ పతాకంపై చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా జే.డి. స్వామి దర్శకత్వంలో జె.సుధాకర్, శివ బి, రాజీవ్ కుమార్ బి, శ్రీనివాస్ లావూరి, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని (అమెరికా) లు సంయుక్తంగా ఈ “పర్‌ఫ్యూమ్” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజయ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేశాయి.

    అంతకుముందు ఈ పర్‌ఫ్యూమ్ చిత్ర టీజర్‌ను విడుదల చేసిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. ఈ వీడియోపై ప్రశంసలు గుప్పించారు. ఇక్కడే వీరి సక్సెస్ కన్‌ఫర్మ్‌ అయిందని చెబుతూ సినిమా స్థాయిని పెంచేశారు. మోషన్‌ పోస్టర్‌, టీజర్‌ చాలా బాగుందని అన్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు సుకుమార్. ఇక చంద్రబోస్ ఈ సినిమాకు సింగిల్ కార్డ్‌గా అన్ని పాటలు రాయడం విశేషం.

    సాంకేతిక నిపుణులు:
    బ్యానర్ : ఫ్రాగ్రన్స్ మ్యానిఫెస్టేషన్
    నిర్మాతలు: జె.సుధాకర్, శివ బి, రాజీవ్ కుమార్ బి, శ్రీనివాస్ లావూరి, రాజేందర్ కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని (అమెరికా)
    కథ, స్క్రీన్ ప్లే & దర్శకత్వం: జే .డి స్వామి
    టెక్నికల్ హెడ్: పీ .జీ . విందా
    డి .ఓ .పీ : రామ్ కె మహేష్
    సంగీతం: అజయ్
    సాహిత్యం: చంద్రబోస్
    కొరియోగ్రాఫర్‌లు: సుచిత్ర చంద్రబోస్, అన్న రాజ్
    ఎడిటర్: ప్రవీణ్ పూడి
    పీ ఆర్. ఓ : సాయి సతీష్, పర్వతనేని రాంబాబు