• November 10, 2021

‘కురుప్’కు తడిసి మోపడయ్యిందట!.. వడ్డీతోనే ఇంకో సినిమా తీయొచ్చన్న దుల్కర్

‘కురుప్’కు తడిసి మోపడయ్యిందట!.. వడ్డీతోనే ఇంకో సినిమా తీయొచ్చన్న దుల్కర్

    కురుప్ సినిమాతో దుల్కర్ సల్మాన్ ఇప్పుడు నేషనల్ వైడ్‌గా పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. మహానటి చిత్రంతో దక్షిణాదిన మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా మహానటి హిట్ అవ్వడం, తనకు గుర్తింపు రావడంతో ప్రతీ సినిమాను తెలుగులో డబ్ చేసుకుంటూ వస్తున్నాడు. అలా ఓకే బంగారం, కనులు కనులు దోచాయంటే చిత్రాలు వచ్చాయి. ఇక్కడి వారిని మెప్పించాయి. అయితే నేరుగా తెలుగు సినిమాతోనూ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు.

    అంతకంటే ముందుగా కురుప్ అంటూ రాబోతోన్నాడు. యథార్థ సంఘటనల ఆధారంగా కురుప్ తెరకెక్కింది. సీరియల్ కిల్లర్, జల్సా రాయుడైన ఈ కురుప్ పాత్రలో దుల్కర్ నటిస్తున్నాడు.అంతే కాకుండా ఈ చిత్రాన్ని దుల్కర్ నిర్మించాడు. అసలే కరోనా కష్టకాలం. సినిమా షూటింగ్ వాయిదా పడుతూనే వచ్చింది. అలా వాయిదాలు పడుతూ ఆలస్యమవుతున్న కొద్దీ కూడా ఫైనాన్షియర్ల దగ్గర తెచ్చిన అప్పుకు వడ్డీలు పెరుగుతూనే ఉంటాయి.

    అది సహజమే. అలా తన కురుప్ సినిమాకు తెచ్చిన అప్పు, పెట్టిన బడ్జెట్ చాలా ఎక్కువ అని చెప్పాడు. ఆ అప్పుకు అయిన వడ్డీతోనే ఓ సినిమా తీయోచ్చు అని సరదాగా కామెంట్ చేశాడు. అంటే ఓ సినిమా బడ్జెట్ అంత వడ్డీ అయిందంటే అది మామూలు విషయం కాదు. మరి ఈ చిత్రం సక్సెస్ అవుతుందా? దుల్కర్‌ను నష్టాల భారీ నుంచి గట్టెక్కిస్తుందా? అన్నది చూడాలి. నిర్మాతగా సక్సెస్ అవుతాడా? లేక కేవలం నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటాడా? అన్నది చూడాలి.

    Leave a Reply