• September 20, 2022

దోచేవారెవరురా షూటింగ్ పూర్తి, అక్టోబర్ లో గ్రాండ్ రిలీజ్ !!!

దోచేవారెవరురా షూటింగ్ పూర్తి, అక్టోబర్ లో గ్రాండ్ రిలీజ్  !!!

    IQ క్రియేషన్స్ పతాకంలో మనీ, సిసింద్రీ, పట్టుకోండి చూద్దాం లాంటి విభిన్నమైన వినోదాత్మక చిత్రాలను రూపొందించిన దర్శకుడు శివనాగేశ్వరరావు నూతన నటీ నటులతో, బొడ్డు కోటేశ్వరరావుగారు రూపొందిస్తున్న సరికొత్త కామెడీ థ్రిల్లర్ చిత్రం దోచేవారెవరురా.. ఈ చిత్రంలో అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి ప్రత్యేక పాత్రలలో కనిపించనున్నారు.

     

    షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లో ఒక సాంగ్ కోసం రామోజీఫిలిం సిటీలో ఒక సెట్ వేసి గ్రాండ్ గా చిత్రీకరించారు. ఒక ముఖ్య సందర్భంలో ఈ సాంగ్ రాబోతోంది. హీరోయిన్ మాళవిక నటించిన ఈ సాంగ్ శంకర్ మాస్టర్ కొరియోగ్రఫి చేశారు. దర్శకుడు తేజ గారు శివనాగేశ్వర రావు గారితో ఉన్న ఫ్రెండ్లీ రిలేషన్ తో తేజ గారు ఈ సాంగ్ కోసం కొన్ని ఇన్ పుట్స్ ఇవ్వడం జరిగింది. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుగుతున్న ఈ సినిమా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతొంది.

     

    దర్శకులు: శివ నాగేశ్వరరావు
    నిర్మాత: బొడ్డు కోటేశ్వరరావు
    నిర్మాణం: IQ క్రియేషన్స్
    పి.ఆర్.ఓ : లక్ష్మీ నివాస్