• November 6, 2021

వాటి సైజులు చెప్పమని అడిగిన నెటిజన్.. దిమ్మ తిరిగేలా ఆన్సర్ ఇచ్చిన దిషా పటానీ

వాటి సైజులు చెప్పమని అడిగిన నెటిజన్.. దిమ్మ తిరిగేలా ఆన్సర్ ఇచ్చిన దిషా పటానీ

    పూరి జగన్నాథ్ పరిచయం చేసిన హాట్ బ్యూటీ దిషా పటానీ. తెలుగు ప్రేక్షకులను లోఫర్ సినిమాతో ఆకట్టుకుంది దిషా. అందులో వరుణ్ తేజ్‌తో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ మళ్లీతెలుగు ప్రేక్షకులను పలకరించలేదు. బాలీవుడ్‌లో మంచి ఫాంలో దూసుకుపోతోంది. సినిమాల కంటే పర్సనల్ లైఫ్ మీద ఎక్కువగా దృష్టి పెట్టినట్టు అనిపిస్తుంది. టైగర్ ష్రాఫ్‌తో వరుస చిత్రాల్లో నటిస్తూ.. మంచి అనుబంధాన్ని కొనసాగిస్తోంది. ఈ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతుంటుంది.

    కొన్ని రోజులు ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. మధ్యలో పెళ్లి వరకు వెళ్లారంటూ.. కానీ అది క్యాన్సిల్ అయిందని అంటారు. తామిద్దరం స్నేహితులమేనని, అంతకు మించి ఏమీ లేదని టైగర్ ష్రాఫ్, దిషా పటానీ చెబుతుంటారు. కానీ ఆ మధ్య ఈ ఇద్దరూ ఎక్కడకు వెళ్లినా జంటగా వెళ్లేవారు. బీ టౌన్ ఈవెంట్లలో జంటగా కనిపించేవారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి వ్యవహారం మాత్రం అంతగా బయటకు రావడం లేదు.

    దిషా పటానీ, టైగర్ ష్రాఫ్‌లు తమ తమ చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా దిషా తన అభిమానులతో ముచ్చటించింది. ఇన్ స్టాలో చాటింగ్ చేసింది. నెటిజన్లు అడిగే ప్రశ్నలకు తీరిగ్గా సమాధానం చెప్పింది. అందులో కొందరు మాత్రం హద్దులు మీరారు. వాటికి తన స్టైల్లో సమాధానం ఇచ్చింది దిషా పటానీ.

    నీ ఫిగర్ సైజ్ ఏంటని ఓ నెటిజన్ అడిగాడు. దానికి పాండా బొమ్మను షేర్ చేసింది. అదే తన ఫిజిక్ అని చెప్పేసింది. ఇక మరో నెటిజన్ నీ బైసిప్స్ సైజ్ ఏంటి? అని అడిగేశాడు. దీంతో భారీగా కండలు దిరిగిన కార్టూన్ బొమ్మను షేర్ చేసింది. అలానే ఉంటుందని అనేసింది. మొత్తానికి నెటిజన్లకు మాత్రం దిషా దిమ్మతిరిగేలా ఆన్సర్‌లు ఇచ్చేసింది.

    Leave a Reply