- September 3, 2022
హిట్ సినిమా తీయలేం.. తీసిన సినిమా హిట్ అవుతుంది!.. దటీజ్ కృష్ణవంశీ
Rangamarthanda-Krishna Vamsi దర్శకుడు కృష్ణవంశీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన గురించి పరిచయం చేయాల్సిన అవసరమూ లేదు. ఒక సింధూరం.. ఒక గులాబీ.. ఒక నిన్నె పెళ్లాడుతా.. ఒక ఖడ్గం.. ఇలా ఎన్నెన్నో బ్లాక్ బస్టర్లు, కల్ట్ క్లాసిక్ చిత్రాలను తెరకెక్కించాడు. కృష్ణవంశీ సినిమా తీసిన సినిమాలు కమర్శియల్‌గా వర్కౌట్ కాకపోయినా కూడా.. అందులో ఎన్నో విలువలు, ఎన్నో గొప్ప సీన్లు ఉంటాయి. ఇంకా ఎన్నో మంచి విషయాలుంటాయి.
పైసాలోని తత్వం, మొగుడు సినిమాలోని ఎమోషన్స్, శశిరేఖ పరిణయంలోని అమాయకత్వం ఇలా ప్రతీ ఒక్క చిత్రంలో ఏదో ఒక అందరినీ కనెక్ట్ చేస్తుంటుంది. ఇక కృష్ణవంశీ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎప్పటికీ నిలిచిపోతాయి. అంత:పురం సినిమాను చూసి ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. ప్రేమను ఎంత బాగా చూపించాడో.. పంతాలు, పట్టింపులను కూడా అంతే బాగా చూపించాడు.
అలా కృష్ణవంశీ మార్క్ తెలుగు ప్రేక్షకుల మీద ఎప్పటికీ ఉంటుంది. అలాంటి కృష్ణవంశీ ఇప్పుడు మరాఠీ సినిమా నట సామ్రాట్‌ను రీమేక్ చేశాడు. రంగ మార్తాండగా తెలుగు వారి ముందుకు తీసుకొస్తున్నాడు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించాడు. ఇందులో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ, రాహుల్ ఇలా ఎంతో మంది నటించారు.
అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో కృష్ణవంశీ చెప్పిన ఓ లైన్ అందరినీ కట్టిపడేస్తుంది. ఇన్ని ఏళ్ల అనుభవంతో ఓ మాట చెప్పేశాడు. ఎవ్వడూ కూడా సినిమాను ఫ్లాప్ చేయడానికి తీయడని, హిట్ అవ్వాలనే ప్రతీ సినిమాను తీస్తామని అన్నాడు. ఎవ్వరూ కూడా హిట్ సినిమాను తీయలేమని, తీసిన సినిమా హిట్ అవుతుందని ఎంతో గొప్పగా చెప్పేశాడు దర్శకుడు.