SKN: నిర్మాత ఎస్‌కేఎన్ లవ్‌లో ఫెయిల్ అయ్యాడా?.. చెప్పిన లాజిక్, చేసిన సాయం గొప్పదే

SKN: నిర్మాత ఎస్‌కేఎన్ లవ్‌లో ఫెయిల్ అయ్యాడా?.. చెప్పిన లాజిక్, చేసిన సాయం గొప్పదే

    SKN: నిర్మాత ఎస్‌కేఎన్ బేబీ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఓ లవ్ ఫెయిల్యూర్ వ్యక్తిని అసిస్టెంట్ డైరెక్టర్‌గా తీసుకున్నాడట. దీంతో ఆయన మీద ప్రశంసలు కురిపిస్తున్నారంతా. లవ్‌లో ఫెయిల్ అయి బాధపడుతున్నాడంటే అతను సెన్సిటివ్ అని, అలాంటి వారికి క్రియేటివ్ మైండ్ ఉంటుందని, అందుకే చాన్స్ ఇచ్చానంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆయన ట్వీట్‌ను సరిగ్గా గమనిస్తే.. ఆయన కూడా ఓ లవ్ ఫెయిల్యూర్ అని అర్థం అవుతోంది.

    బేబీ సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఈ సినిమా పాటలు, సంగీతం అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సినిమా రిలీజ్ మీద అందరి దృష్టి పడింది. ఈ చిత్రం జూలై 14న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్‌లు నటించారు. నిర్మాత చెప్పిన లవ్ ఫెయిల్యూర్ లాజిక్, చేసిన సాయం మీద జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు.