• January 18, 2022

విడిపోయిన మరో జంట.. రజినీకాంత్ కూతురికి విడాకులిచ్చిన ధనుష్

విడిపోయిన మరో జంట.. రజినీకాంత్ కూతురికి విడాకులిచ్చిన ధనుష్

    Dhanush Aishwarya Divorce సినీ ఇండస్ట్రీలో ప్రేమలు ఎంత త్వరగా చిగురిస్తాయో.. పెళ్లి ఎంత త్వరగా అవుతుందో.. బ్రేకప్పులు కూడా అంతే త్వరగా అవుతాయి. విడాకులు అన్నవి వారికి చాలా కామన్‌గా అవుతున్నాయి. వరుసగా విడాకులు తీసుకుంటూ సెలెబ్రిటీలు హాట్ టాపిక్ అవుతున్నారు. నిన్నటికి నిన్న శ్రీజ, కళ్యాణ్ దేవ్‌లపై రూమర్లు వచ్చాయి. శ్రీజ కళ్యాణ్‌గా ఉన్న తన పేరుని శ్రీజ కొణిదెలగా మార్చుకోవడంతో అందరికీ అనుమానాలు మరింతగా ఎక్కువయ్యాయి.

    అయితే ఇప్పుడు తాజాగా మరో సినీ జంట విడాకులు తీసుకుంది. అది కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యకు ధనుష్ విడాకులు ఇచ్చాడు. సూపర్ స్టార్ అల్లుడిగా ధనుష్‌కు మంచి క్రేజ్ వచ్చింది. అయితే మధ్యలో ధనుష్ పాపులారిటీ విపరీతంగా పెరిగిపోయింది. ఇలా సడెన్‌గా విడాకుల ప్రకటన ఎందుకు వచ్చిందో తెలియడం లేదు కానీ.. ఈ ప్రకటన మాత్రం ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతోంది.

    ఫ్రెండ్స్, కపుల్, తల్లిదండ్రులుగా మా ఈ పద్దెనిమిదేళ్ల బంధం పెరుగుతూనే వచ్చింది. అర్థం చేసుకుంటూ, సర్దుకుంటూ, అన్ని పరిస్థితులను అంగీకరిస్తూ ముందుకు వచ్చాం. కానీ ఈ రోజు మేం మా దారులను వేరుగా ఎంచుకున్నాం. భార్యభర్తలుగా మేం విడిపోయేందుకు నిర్ణయించుకున్నాం. ఈ పరిస్థితిని అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. మా నిర్ణయాన్ని అందరూ గౌరవించి, మా ప్రైవసీని అర్థం చేసుకుంటారని వేడుకుంటున్నాను అని ధనుష్ ట్వీట్ వేశాడు.

    Leave a Reply