• November 7, 2021

NTR-DSP: ఎన్టీఆర్ ఫోన్ చేస్తే గుర్తు పట్టని దేవీ శ్రీ ప్రసాద్!.. వ్యవహారం వేరేలా ఉందే

NTR-DSP: ఎన్టీఆర్ ఫోన్ చేస్తే గుర్తు పట్టని దేవీ శ్రీ ప్రసాద్!.. వ్యవహారం వేరేలా ఉందే

    NTR-DSP దేవీ శ్రీ ప్రసాద్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఎన్నో హిట్లు వచ్చాయి. అదుర్స్, నాన్నకు ప్రేమతో వంటి చిత్రాలు ఎన్టీఆర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచాయి. ఆ చిత్రాలకు దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలు, కొట్టిన మ్యూజిక్ బాగా కలిసి వచ్చింది. అయితే ఎన్టీఆర్‌కు దేవీ శ్రీ ప్రసాద్, తమన్ ఇలా ఇద్దరూ కూడా క్లోజ్. ఆ ఇద్దరి మ్యూజిక్ డైరెక్షన్‌లో మంచి చిత్రాలు వచ్చాయి.

    అయితే ఈ మధ్య ఆ ఇద్దరినీ తన షోకు పిలిపించుకున్నాడు ఎన్టీఆర్. ఎవరు మీలో కోటీశ్వరుడు షోలో దేవీ శ్రీ ప్రసాద్, తమన్ వచ్చారు. అక్కడ ఈ ముగ్గురూ ఎంతో సరదాగా ముచ్చట్లు పెట్టుకున్నారు. తమ మొదటి పరిచయం, నాటి విశేషాలను గుర్తు చేసుకున్నారు. మణిశర్మ గారి స్టూడియోలో ఎన్టీఆర్, తమన్‌లు కలుసుకున్నారట. ఇక తమన్ మొదటి చిత్రం విడుదల కాక ముందు.. బృందావనం సినిమాను ఇవ్వడంతో తమన్ ఎంతో బాధ్యతగా ఫీలయ్యాడట.

    దేవీ శ్రీ ప్రసాద్, ఎన్టీఆర్‌ల కలయిక విచిత్రంగా జరిగిందట. ఓ సారి ఫ్లైట్‌లో వెళ్తుంటే.. కలిశారట. నేను దేవీ శ్రీ ప్రసాద్‌ను అని వచ్చి పరిచయం చేసుకున్నాడు. అబ్బె భలే వారే నాకు ఎందుకు తెలీదు అని ఎన్టీఆర్ అన్నాడు. ఆ తరువాత మరో సీన్‌ను దేవీ శ్రీ ప్రసాద్ గుర్తు చేశాడు.

    వర్షం సినిమా రీ రికార్డింగ్ జరుగుతోంది. నా ఫోన్‌ రింగ్ అయింది. లిఫ్ట్ చేస్తే.. నేను ఎన్టీఆర్ అని ఎవరో అన్నారు. ఎన్టీఆరా? అని నేను ఆశ్చర్యపోయాను.. ఎవరో ఫ్రాంక్ కాల్ చేస్తున్నారేమో అని.. ఎవరు అని మళ్లీ అడిగాను. నేను ఎన్టీఆర్ అని మళ్లీ అన్నాడు. ఇదేంటో చూడమని పక్కన మధు గారికి ఇచ్చాను. నమస్తే సార్ మీరా? అని అన్నాడు. అప్పుడు ఎన్టీఆర్ అని అర్థమైందని దేవీ శ్రీ ప్రసాద్ అన్నాడు. అన్ని సార్లు నేను ఎన్టీఆర్ అని చెప్పింది ఒక్క దేవీ శ్రీ ప్రసాద్‌కే అంటూ ఎన్టీఆర్ సెటైర్లు వేశాడు.

    Leave a Reply