• November 15, 2021

Ee Raathale : రాధే శ్యామ్ ఫస్ట్ సింగిల్.. ప్రభాస్ పూజా హెగ్డే చివరకు అలా?

Ee Raathale : రాధే శ్యామ్ ఫస్ట్ సింగిల్.. ప్రభాస్ పూజా హెగ్డే చివరకు అలా?

    Ee Raathale ప్రభాస్ పూజా హెగ్డే కాంబినేషన్‌లో రాబోతోన్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రాధే శ్యామ్ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. మొన్న వదిలిన చిన్న పాటి టీజర్ ఓ రేంజ్‌లొ క్లిక్ అయింది. విక్రమ్ ఆదిత్య పాత్ర తీరు తెన్నులేంటని వివరిస్తూ వదిలిన ఆ గ్లింప్స్ సినిమాకు సంబంధించిన ఎన్నో హింట్లను వదిలింది. మొత్తానికి రాధే శ్యామ్ మాత్రం ఇప్పుడు వరుస అప్డేట్లో హల్చల్ చేయబోతోంది.

    ఈ క్రమంలో తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ నుంచి మొదటి పాటను కాసేపటి క్రితమే విడుదల చేశారు. దక్షిణాది భాషల్లో రాబోతోన్న రాధే శ్యామ్‌కు జస్టిన్ ప్రభాకరణ్ సంగీతం అందిస్తున్నాడు. డియర్ కామ్రేడ్ సినిమాతో జస్టిన్ అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు రాధేశ్యామ్ సినిమాతో మరోసారి సౌత్‌లో తన సత్తా చాటబోతోన్నాడు. ఈ రాతలే అంటూ వదిలిన ఈ పాట ఇప్పుడునెట్టింట్లో ట్రెండ్ సెట్టర్ అయ్యేలా కనిపిస్తోంది.

    పాట ట్యూనీ, మలిచిన విధానం అన్నీ కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి. ఇలా ఒక్క పాటతో అంచనాలన్నీ రెట్టంపు చేసేశారు. ఇక సినిమా నుంచి రాబోయే అప్డేట్లు ఇంకెలా ఉంటాయో ఊహించుకోండి అనేలా అభిమానుల్లో ఆసక్తిని పెంచేశారు. అయితే ఈ చిత్రంలో విషాదాంతం ఉండేలా.. చివరక ప్రభాస్, పూజా హెగ్డే కలవరేమో? అన్నట్టుగా ఉంది. మొత్తానికి పాట మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దిగోబోతోంది. రాధాకృష్ణ కుమార్ ఈ సినిమా కోసం ఎంతలా కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే. అది తెరపై కనిపించేలానే ఉంది.

    అయితే ఈ పాటను విడుదల చేయడంలో అలసత్వం వహించిన యూవీ క్రియేషన్‌పై అభిమానులు మండిపడ్డారు. సాయంత్రం ఐదు గంటలకు రావాల్సిన పాటను రాత్రి ఎనిమిది గంటలకు విడుదల చేశారు. ఇలా ఆలస్యం అవ్వడం చిత్రయూనిట్‌ను ప్రభాస్ అభిమానులు ఏకిపారేశారు. మొత్తానికి పాటను చూసిన ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు.

    Leave a Reply