- August 30, 2022
” దక్ష సినిమా ” 1స్ట్ లుక్ ని విడుదల చేసిన ప్రముఖ నిర్మాత బెక్కం వేణు గోపాల్.

సీనియర్ నటుడు శరత్ బాబు తనయుడు ఆయుష్ హీరో గా చేస్తున్న సినిమా ” దక్ష”.
శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్ పై
తల్లాడ సాయి కృష్ణ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కి వివేకానంద విక్రాంత్ దర్శకుడు.
ఈ సినిమా కి సంబంధించిన 1స్ట్ లుక్ ని ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ విడుదల చేసారు.
ఈ సందర్భంగా బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ ” బేసిక్ గా సినిమా చూడాలని ఆశ ప్రేక్షకుడికి ఆ సినిమా పోస్టర్ బట్టి ఉంటుంది,
నేను కూడా ఈ దక్ష పోస్టర్ చూడగానే మళ్ళీ మళ్ళీ చూడాలి అని థ్రిల్లింగ్ గా ఉంది,సినిమా వివరాలు అడిగి తెలుసుకున్నాను,
టీం వర్క్ చేస్తూ బాగా కష్టపడుతున్నారు.
డైరెక్టర్ వివేకానంద విక్రాంత్ కి , నిర్మాత కి, అలానే హీరో ఆయుష్ కి, హీరోయిన్ అను, నక్షత్ర, రియా ల కి శుభాకాంక్షలు అని అన్నారు.
నిర్మాత తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ మా 1స్ట్ లుక్ ని చూడగానే నచ్చి రిలీజ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన బెక్కం వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు అన్నారు.
డైరెక్టర్ వివేకానంద విక్రాంత్ మాట్లాడుతూ
నా బర్త్ డే నాడు నా 1స్ట్ సినిమా 1స్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది, ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నది, మా లాంటి ఫిల్మ్ మేకర్స్ ని ఎంకరేజ్ చేస్తున్న బెక్కం వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు అన్నారు.
నటి నటులు- ఆయుష్, అను, నక్షత్ర, రియా ,అఖిల్,రవి రెడ్డి , శోభన్ బాబు, పవన్.
నిర్మాత – తల్లాడ శ్రీనివాస్, తల్లాడ సాయి కృష్ణ
డైరెక్టర్ – వివేకానంద విక్రాంత్
కెమెరా- శివ రాథోడ్, ఆర్.ఎస్ శ్రీకాంత్,
రచన(రైటర్)- శివ కాకు,
సాహిత్యం – శరత్ చంద్ర తిరుగనూరి,
కొరియోగ్రాఫర్ – సాగర్
సంగీతం – శేఖర్
పి.ఆర్.ఓ – పవన్ పాల్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్-
అశోక్ నిమ్మల, గౌతమ్ ,విజయ్ నిట్టల