• November 17, 2021

Suriya: హీరో సూర్యకు వ్యతిరేకం.. ‘జై భీమ్’పై కమెడియన్ సంతానం కామెంట్స్

Suriya: హీరో సూర్యకు వ్యతిరేకం.. ‘జై భీమ్’పై కమెడియన్ సంతానం కామెంట్స్

    Suriya ప్రస్తుతం సమాజం ఎంత సున్నితంగా మారిందో అందరికీ తెలిసిందే. ప్రతీ ఒక్కరికీ ఇట్టే మనోభావాలు దెబ్బతింటున్నాయి. అలాంటి సందర్భంలో ఓ సినిమా తీస్తున్నామంటే ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. తాజాగా అమెజాన్‌లో జై భీమ్ అంటూ సూర్య వచ్చాడు. అణాగారిన వర్గాల కోసం పాటు పడ్డ లాయర్, జస్టిస్ చంద్రు కథే జై భీమ్. పోలీస్ లాకప్ డెత్, బలహీన వర్గాలు, సంపన్న వర్గాలు అంటూ ఈ కథ సాగుతూ ఉంటుంది. అప్పటి పరిస్థితులను చూపిస్తుంటుంది.

    అయితే ఇందులో కొన్ని తప్పులు దొర్లాయని అంటున్నారు. నిజమైన కథలో తప్పు చేసింది మాత్రం క్రిస్టియన్ వ్యక్తి..కానీ సినిమాలో మాత్రం హిందువుగా చూపించారు అని కామెంట్లు పెడుతున్నారు. అందులోనూ మరీ ముఖ్యంగా తమిళంలోని వన్నియార్ అనే కులాన్ని విలన్లుగా చిత్రీకరించారని ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా కమెడియన్ కమ్ హీరోగా మారిన సంతానం కూడా అదే కమ్యూనిటికీ చెందిన వాడట. తన సభాపతి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సంతానం మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

    అది ఎవరైనా సరే గానీ ఓ వర్గాన్ని ప్రశసించాలంటే.. మరో వర్గాన్ని కించపరిచి చూపించాల్సిన అవసరం లేదు. అది చాలా తప్పు. సినిమాకు వెళ్లేది అందరం ఎంజాయ్ చేయడానికి . కులమతాలను అన్నీ మరిచిపోయి అందరం ఎంజాయ్ చేయాలి. కానీ ఇలా ఓ వర్గాన్ని పైకి లేపేందుకు.. ఇంకో వర్గాన్ని తొక్కడం తప్పు. అయితే సినిమా చూడకుండా కామెంట్ చేయకూడదు. ఏవైనా తప్పులు అనిపిస్తే చెప్పాలి.. మేకర్లు కూడా కాస్త ఆలోచించాలి అంటూ సంతానం చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

    కొంత మంది సంతానం వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతున్నారు. ఇంకొందరు మాత్రం సూర్య రైట్ అని అంటున్నారు. సూర్య ఓ వర్గానికి వ్యతిరేకమని అంటున్నారు. #WeStandWithSanthanam, #SuriyaAgainstVanniyars అనే హ్యాష్ ట్యాగ్‌లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

    Leave a Reply