- January 14, 2022
Rowdy Boys Twitter Review: బాయ్స్ పరిస్థితి మరీ దారుణం.. ఎక్కడా కనిపించని దిల్ రాజు హవా
Rowdy Boys Twitter Review దిల్ రాజు కాంపౌండ్ నుంచి ఓ హీరో వచ్చాడు. దిల్ రాజు తన అన్న శిరీష్ కొడుకు అశీష్ను Rowdy Boys సినిమాతో హీరోగా లాంచ్ చేశాడు. మొదటి సినిమా కావడంతో భారీ ఎత్తున ప్రమోషన్స్ చేశాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ ఇలా టాప్ హీరోలందరినీ రంగంలోకి దించాడు. సినిమా మీద బజ్ క్రియేట్ చేశాడు. చివరకు ముద్దు సీన్లకు నో చెప్పే అనుపమతోనే లిప్ కిస్ చేయించాడు. అలా సినిమాను వీలైనంతగా ముందుకు తీసుకెళ్లాడు.
అయితే సినిమాను ఎంతగా ప్రమోట్ చేసినా చూసేందుకు జనాలు ఉండాలి. అక్కడే రౌడీ బాయ్స్ సినిమాకు దెబ్బ పడింది. రౌడీ బాయ్స్ అనే సినిమాను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ట్విట్టర్లో అసలు రౌడీ బాయ్స్ ఊసే కనిపించడం లేదు వినిపించడం లేదు. ట్విట్టర్ టాక్, రివ్యూ కోసం వెతికితే ఒక్క ట్వీట్ కూడా కనిపించడం లేదు.
Gunde king MAFIA
Tho
Ivala #RowdyBoys ki unanimous positive reviews vastai all websites#Bangarraaju #Bangarraju mida edupulu start ayyay— surya bhai (@robustaban) January 14, 2022
ఇక కొందరు అయితే రౌడీ బాయ్స్, ఆశీష్, దిల్ రాజుని ఏకిపారేస్తున్నారు. దిల్ రాజు మాఫియాతో అన్ని వెబ్ సైట్లలో సినిమాకు మంచి రేటింగ్లు, సూపర్ హిట్ అని వస్తుంది అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
Tenali lo #Bangarraju eh tiskola 🙄
Sare #RowdyBoys tiskunaru ani chuste oka ticket kuda book cheyala evadu 😮
Dilmama debbaki tiskunaru emo kani reality lo evaru dekatla pic.twitter.com/I7beTdxvRF
— . (@BabluRockzzzz) January 14, 2022
ఇక తెనాలిలో రౌడీబాయ్స్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బంగార్రాజు సినిమాను అక్కడ తీసుకోలేదట. అయితే రౌడీ బాయ్స్ సినిమాను రిలీజ్ చేశారట. కానీ ఒక్కడంటే ఒక్కడు కూడా టికెట్ బుక్ చేసుకోలేదట. అలా మొత్తానికి రౌడీ బాయ్స్ పరిస్థితి మరీ దారుణంగా ఉందని అర్థమవుతోంది.