- November 20, 2021
Poster Telugu Movie Review : ‘పోస్టర్’ రివ్యూ.. పాత పోస్టరే కానీ

Poster Telugu Movie Review పోస్టర్ అనే పదం లేకుండా సినిమాలు ముందుకెళ్లవు. అలాంటిది పోస్టర్ అనే పేరుతోనే సినిమా వస్తే ఎలా ఉంటుంది. పోస్టర్ అంటూ టైటిల్‌తోనే అందరినీ ఆకట్టుకున్నారు. క్యాచీ టైటిల్‌తో కొత్త దర్శకుడు, నూతన నటీనటులు పరిచయమవుతున్న చిత్రం పోస్టర్. విజయ్ ధరన్ హీరోగా రాశిసింగ్, అక్షత సోనావానే హీరోయిన్లుగా నటించారు. కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే యూత్ ఆడియన్స్ దృష్టి తమవైపు తిప్పుకున్న ఈ సినిమా టీజర్ ట్రైలర్‌కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ శుక్రవారం(నవంబర్ 19)న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
సిద్దిపేటకి చెందిన శ్రీను (విజయ్ ధరన్) ఆవారాగా తిరుగుతూ జాలీగా జీవితాన్ని గడిపేస్తుంటాడు. తన తండ్రి పనిచేస్తున్న ఒక థియేటర్ ఓనర్ పెద్దారెడ్డి కూతురు మేఘన(అక్షత)తో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. పెద్దారెడ్డి.. శ్రీనులోని ధైర్యసాహసాలు నచ్చి తన దగ్గరే పనిలో పెట్టుకుని అతనితో సెటిల్మెంట్స్ చేయిస్తుంటాడు. ఆ తర్వాత వీళ్ల ప్రేమ విషయం తెలుసుకున్నపెద్దారెడ్డి తన మనుషులతో శ్రీను ఇంటిపై దాడి చేయిస్తాడు. ఆ ఊర్లో వాళ్ల ఎదుట శ్రీను, అతడి తల్లిదండ్రుల పరువు తీస్తాడు పెద్దారెడ్డి. దీంతో అవమానంగా ఫీలైన తండ్రి శ్రీనుని ఇంటి నుండి బయటకు గెంటేస్తాడు. అలా బయటకు వెళ్లిన శ్రీను లైఫ్ ఎలా మారిపోయింది? మరి మేఘనతో శ్రీను ప్రేమకథ ఎలా మలుపు తీసుకుంది? జీరో లాగా ఇంటి నుండి బయటకు వెళ్లిన శ్రీను హీరోలా ఎలా వచ్చాడు అనేదే పోస్టర్.
ఇలాంటి కథ, కథనం బ్యాక్ డ్రాప్లో లెక్కలేనన్ని సినిమాలు వచ్చాయి. ఇది సక్సెస్ ఫుల్ ఫార్మూలా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు పోస్టర్లోనూ అదే పాయింట్‌తో వచ్చారు. దర్శకుడు టి మహిపాల్ రెడ్డి ఆ జాగ్రత్తలు తీసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా ఈ కథని తీర్చిదిద్దాడు. సినిమాలోని అసలు ఫ్లాట్‌ని ఓపెన్ చేయకుండా ఆ సస్పెన్స్‌ని కంటిన్యూ యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో మలిచిన తీరు ఆకట్టుకుంటుంది. తండ్రి కొడుకుల బాండింగ్, కొడుకు భవిష్యత్తు కోసం తండ్రి పడే తపన, విలేజ్ నేటివిటీ, లవ్, డ్రామా, సాంగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇంటర్వెల్ పార్ట్ కొత్తగా ఉంది. క్లైమాక్స్ సినిమాకి హైలైట్. విలేజ్ బ్యాక్ డ్రాప్, లవ్ ట్రాక్ యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కి కూడా ఆకట్టుకుంటాయి.
శ్రీనుగా హీరో విజయ్‌ధరన్ తొలి సినిమాతోనే ఇంటెన్స్ పెర్ఫామెన్స్‌తో మెప్పించాడు. సినిమాని రక్తికట్టించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. రాశి సింగ్ పక్కింటి అమ్మాయిలా ఆకట్టుకుంది. మరో హీరోయిన్ అక్షత సోనావానే అటు గ్లామర్ డాల్ అండ్ మోడ్రన్ విలేజ్ అమ్మాయి లుక్ లో కుర్రకారుని అలరించింది. సినిమాతో పాటు యూత్ ఆడియన్స్‌కు గ్లామర్ ట్రీట్‌నిచ్చింది. హీరో తండ్రిగా శివాజీరాజా సెటిల్డ్ గా పెర్ఫామ్ చేశారు. పెద్దిరెడ్డిగా రామరాజు విలనిజం బాగుంది. హీరో ఫ్రెండ్స్ గా రవీందర్ మంచి పాత్రలో కనిపించారు.
మహిపాల్ రెడ్డికి దర్శకుడిగా తొలి సినిమా కావడంతో ఫుల్ ఎఫర్ట్ పెట్టారని తెలుస్తోంది. తన కష్టం స్క్రీన్ మీద కనిపిస్తుంది. అన్ని వర్గాల ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా, తాను చెప్పాలనుకున్నది క్లారిటీగా చెప్పాడు. ఎక్కడా కొత్త దర్శకుడు అనిపించదు. ఈ కథకు, అంతర్లీనంగా ప్రస్తుత సమాజంలో అందరికి కావాల్సిన ఒక సందేశాన్ని కూడా ఇవ్వడం విశేషం. శాండీ అద్దంకి పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్‌గా తెరకెక్కించారు. మార్తాండ్ కె వెంకటేష్ తన కత్తెరకు ఇంకాస్త పదునుపెట్టాల్సింది. రాహుల్ విజువల్ కథకి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయంట్స్:
నటీనటులు
సందేశం
నేపథ్య సంగీతం
మైనస్ పాయంట్స్
స్లో నెరేషన్
నిడివి
రేటింగ్-2.75