Good luck Sakhi Movie Review: కీర్తి సురేష్ మెప్పించింది కానీ.. బ్యాడ్ లక్ సఖి!

Good luck Sakhi Movie Review: కీర్తి సురేష్ మెప్పించింది కానీ.. బ్యాడ్ లక్ సఖి!

    Good luck Sakhi Movie Review కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి చిత్రం నేడు (జనవరి 28) విడుదలైంది. ఆది పినిశెట్టి, జగపతి బాబు వంటి వారు ప్రధాన పాత్రలను పోషించారు. ఇక నేషనల్ అవార్డ్ విన్నర్ నగేష్ కుకునూర్ తెలుగులో మొదటి సారిగా స్ట్రెయిట్ సినిమాను చేశారు. మొత్తానికి ఈ చిత్రం ఎన్నో పర్యాయాలు వాయిదా అనంతరం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

    కథ
    సఖి (కీర్తి సురేష్)ని ఊర్లో అంతా కూడా బ్యాడ్ లక్ సఖి అని ఎగతాళి చేస్తుంటార. సఖి ఏ పని చేద్దామని అనుకున్నా అంతా రివర్స్ అవుతుంటుంది. అందుకే అందరూ బ్యాడ్ లక్ సఖి అని ముద్ర వేస్తారు. గోలి రాజు (ఆది పినిశెట్టి) మాత్రం సఖిని ఇష్టపడుతుంటాడు. ఇక ఎక్స్ కల్నల్ (జగపతి బాబు) మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తాడు. ఊర్లోనే ప్రతిభ ఉంటుందని నమ్మి వస్తాడు. అలా సఖిలో ఉన్న రైఫిల్ షూటింగ్ ప్రతిభను వెలికితీయాలని చూస్తాడు. ఊరి నుంచి రాష్ట్రస్థాయి వరకు సఖి ప్రయాణం ఏంటన్నదే గుడ్ లక్ సఖి.

    నటీనటులు

    గుడ్ లక్ సఖి మొత్తంలో కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబులే కనిపిస్తారు. రాహుల్ రామకృష్ణ మధ్య మధ్యలో నవ్విస్తాడు. అయితే ఈ చిత్రాన్ని కీర్తి సురేష్ తన భుజాల మీద మోసేసింది. తన నటనకు వంక పెట్టాల్సిన అవసరం రాదు. సఖి పాత్రలో కీర్తి సురేష్ జీవించేసింది. పల్లెటూరి అమ్మాయిలో కనిపించే అమాయకత్వం, చలాకీదనం ఇలా అన్నీ కూడా చూపించేసింది కీర్తి సురేష్.

    కీర్తి సురేష్ తన పాత్రకు న్యాయం చేసేసింది. ఇక గోలి రాజుగా ఆది పినిశెట్టి పర్వాలేదనిపిస్తాడు. కానీ గుర్తుండిపోయే పాత్ర అయితే కాదు. ఇక జగపతి బాబుకు ఇలాంటి పాత్రలు ఇప్పటికే బోలెడు వచ్చాయి. ఇలా ఒకే రకమైన పాత్రల్లో చూసి చూసి జనాలకు బోర్ కొట్టేస్తుంది. ఇక ఈ చిత్రంలో అంతగా చెప్పుకోదగ్గ పాత్రలేవి కూడా కనిపించవు.

    విశ్లేషణ

    స్పోర్ట్స్ డ్రామా అంటే ముగింపు ఏంటో చిన్న పిల్లాడికి కూడా అర్థమవుతుంది. స్పోర్ట్స్ డ్రామాలో లగాన్, చక్ దే ఇండియా వంటి సినిమాలు మాత్రమే మన ఇండియన్ తెరకు దారిని చూపిస్తాయి. అవి ఎవర్ గ్రీన్ చిత్రాలు. క్రీడతో పాటు సరైన ఎమోషన్‌ను పండించగలిగినప్పుడు సినిమా వర్కవుట్ అవుతుంది. ఇప్పుడు స్పోర్ట్స్ డ్రామా తీయడం అంటే మామూలు విషయం కాదు.

    ఆటకు తగ్గ ఎమోషన్‌ను నటీనటుల నుంచి రాబట్టుకోవాలి. ఆ ఎమోషన్‌ను ప్రేక్షకుడికి కనెక్ట్ చేయించగలగాలి. అలా చేసినప్పుడు ఈ జానర్ చిత్రాలు వర్కవుట్ అవుతాయి. ఇక్కడ కీర్తి సురేష్ ప్రయాణం ఎంతో సిల్లీగా సాగుతుంది. సఖి ప్రయాణం, ఒడిదుడుకుల్లో ఏమంత కొత్తదనం కనిపించదు. ప్రతీ సీన్‌ను అంచనా వేయగలిగేస్తుంటారు.

    అక్కడే ఈ సినిమా విఫలమైంది. చివరి వరకు ప్రేక్షకుడిని కూర్చో బెట్టలేకపోతుంది. ఒక దశ దాటాకా ఈ చిత్రం ఎప్పుడు అయిపోతుందా? అని ప్రేక్షకుడు తల పట్టుకునేలా ఉంటుంది. ఇలాంటి సినిమాకు సంగీతం, సినిమాటోగ్రఫీ వంటివి బలంగా మారుతుంటాయి. ఈ సినిమాకు ఇవి మరీ అంత బలాన్ని అయితే ఇవ్వలేదు. కథ, కథనంలోనే ఎమోషన్ లేనప్పుడు ఎవ్వరూ ఏమీ చేయలేరని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా నిలుస్తుంది.

    మొత్తానికి కీర్తి సురేష్‌కు మరోసారి దురదృష్టం వెంటాడింది. మిస్ ఇండియా, పెంగ్విన్,రంగ్ దే వంటి ఫ్లాపుల తరువాత మళ్లీ గుడ్ లక్ సఖి కూడా చేదు అనుభవాన్ని మిగిలింది. అలా కీర్తి సురేష్ కూడా సఖిలానే అయిపోయింది.

    చివరగా.. గుడ్ బ్యాడ్ లక్ సఖి

    రేటింగ్ : 2.5

    Leave a Reply