• August 31, 2022

Cobra Twitter Review : కోబ్రా ట్విట్టర్ రివ్యూ.. విక్రమ్ నట విశ్వరూపం

Cobra Twitter Review : కోబ్రా ట్విట్టర్ రివ్యూ.. విక్రమ్ నట విశ్వరూపం

    Cobra Movie Tiwtter Review తమిళం, తెలుగులో ఒకే రేంజ్ ఫాలొయింగ్‌ను సంపాదించుకున్నాడు విక్రమ్. అలాంటి విక్రమ్‌కు గత కొన్నేళ్లుగా హిట్ లేకుండాపోయింది. సరైన హిట్టు కోసం విక్రమ్ చాలానే కష్టపడుతున్నాడు. మహాన్ సినిమాకు మంచి పేరు వచ్చింది.కానీ అది ఓటీటీకే పరిమితమైంది. ఇప్పుడు కోబ్రా అంటూ మరోసారి ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఇక ఇప్పటికే పలు చోట్ల షోలు పడటంతో టాక్ బయటకు వచ్చింది. ట్విట్టర్ చియాన్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.

    ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది. వేరే లెవెల్.. బ్లాక్ బస్టర్ పడ్డట్టే అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టేశాడు. ఫస్ట్ హాఫ్ సూపర్.. విక్రమ్ ఫైర్ మీదున్నాడు.. అదిరిపోయిందని అంటున్నారు. మూడేళ్ల తరువాత విక్రమ్ మళ్లీ ఇలా తన విశ్వ రూపాన్ని చూపించేశాడని పొగిడేస్తున్నారు.

    https://twitter.com/luckyuvi7/status/1564775703731507200?s=20&t=j9pIEcgm0SeHB8EKAWatmQ

    కోబ్రా వేరే లెవెల్ మూవీ.. విక్రమ్ ఇంట్రో సీన్ అదిరిపోయింది.. ప్రతీ సీన్ మంట పుట్టించేలా ఉంది.. కచ్చితంగా ఈ చిత్రాన్ని థియేటర్లో చూడాల్సిందేనని అంటున్నారు. విక్రమ్ నుంచి మరో సెటిల్ పర్ఫామెన్స్ వచ్చింది.. ఐ సినిమాలో మాదిరిగా ప్రోస్థటిక్ మేకప్ కాకుండా.. కారెక్టర్లకు తగ్గట్టుగా ఉంది.. ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ అదిరిపోయిదంతే. ఇక రెండో హాఫ్ కోసం వెయింటింగ్ అంటూ ఇంకో నెటిజన్ కామెంట్ పెట్టేశాడు.

    ఇంకొందరు అభిమానులు ఆత్రం ఆపుకోలేక వీడియోలు షేర్ చేస్తూ వచ్చారు. దీంతో టీం అలర్ట్ అయి ఆ అకౌంట్లను డిలీట్ చేసేస్తోందట. మొత్తానికి కోబ్రా టీం మాత్రం ఫుల్ కేరింగ్ తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. విక్రమ్ ఆటోలోంచి మాస్ ఎంట్రీ ఇచ్చే సీన్ అదిరిపోయిందంట.