- August 31, 2022
Cobra Movie Review కోబ్రా మూవీ రివ్యూ.. అర్థంకాని ఆల్‌జీబ్రా

Cobra Review చియాన్ విక్రమ్ పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరకదు. ప్రతీ సినిమాలోనూ అదే జరుగుతూ ఉంటుంది. ఐ సినిమాకు ఎంతో కష్టపడ్డాడు. కానీ సినిమా అంతగా ఆడలేదు. అలా ఎన్నో చిత్రాల్లో విక్రమ్ తన ఒళ్లు హూనం చేసుకున్నాడు. కానీ సినిమాలు ఆడలేదు. ఇప్పుడు కోబ్రా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
కథ
వ్యాపారవేత్త రిషి (రోషన్ మాథ్యూ) తనకు అడ్డు వచ్చిన సీఎం, స్కాట్లాండ్ ప్రిన్స్, లండన్ డిఫెన్స్ అధికారి ఇలా అందరినీ చంపించేస్తుంటాడు. ఆ సీరియల్ కిల్లర్స్ చేసింది మధి (విక్రమ్). మాథమేటిక్స్ ఫార్మూలాను వాడి ఈ హత్యలను చేస్తుంటాడు. దాన్ని కనిపెట్టడంలో ఇంటర్ పోల్ అధికారి అస్లాం (ఇర్పాన్ పటాన్)కు భావన (శ్రీనిధి శెట్టి) స్టూడెంట్ జుది (మీనాక్షి) సాయం చేస్తుంటుంది. చివరకు కోబ్రాను పట్టుకోగలిగారా? కోబ్రా గతం ఏంటి? చివరకు మధి ఏమయ్యాడు? అనేది కథ.
నటీనటులు
విక్రమ్ నటనకు హద్దులనేవి ఉండవు. పాత్రకు తగ్గట్టుగా ఎన్నో గెటప్పులు వేస్తుంటాడు. కోబ్రాలో ఎన్ని గెటప్స్ వేశాడో కూడా లెక్క పెట్టడం కష్టమే. అయితే తన వరకు విక్రమ్ వంద శాతం న్యాయం చేశాడు. ఇర్ఫాన్ పటాన్ అంతగా ప్రభావం చూపించలేదు. విలన్‌గా కనిపించిన రోషన్ పర్వాలేదనిపించాడు. శ్రీనిధి శెట్టి పాత్రకు అంత ఇంపార్టెన్స్ లేదనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, మృణాళిని పాత్రలు అంతగా మెప్పించలేదనిపిస్తుంది. మిగిలిన పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు నటించేశారు.
విశ్లేషణ
ఏ కథ అయినా కూడా ఎంతో సులభంగా అర్థమయ్యేలా చెప్పాలి.. వివరంగా చెప్పాలి. గందరగోళంగా కథను చెప్పుకూడదు. కానీ కథలోనే గందరోగోళం ఉంటే అదే కోబ్రా సినిమా అవుతుంది. కవలలు, ఒకరి కోసం ఒకరు నిలబడం, చివరకు ఓకే ఐడెంటిటీతో బతకడం, ఇద్దరి మధ్య గొడవలు రావడం ఇలా మంచి కాన్సెప్ట్‌లానే ఉంది. కానీ దాన్ని తెరకెక్కించిన విధానంలోనే ఎంతో కన్ఫ్యూజన్ ఉన్నట్టు అనిపిస్తుంది.
కథ ఏంటి? అసలేం జరుగుతోంది? అనే దానిపై చూస్తోన్న ప్రేక్షకుల్లో క్లారిటీ ఉండదు. అసలు సినిమాను తీసిన దర్శకుడిలోనైనా క్లారిటీ ఉందా? అనది డౌటే. మది, ఖదీర్ పాత్రలని చెప్పి.. అందరినీ చిందరవందర చేసేశారు. ఎవరు ఏంటి? అనేది అర్థం కాకుండా తీసేశారు. ప్రథమార్థం వరకు సినిమాను హై లెవెల్లో తీసిన దర్శకుడు.. ద్వితీయార్థాన్ని నీరసంగా తెరకెక్కించాడు.
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఏమంత ఎమోషన్స్ పండించలేదు. ఏ రకంగా ఆడియెన్స్ కనెక్ట్ కాలేకపోయింది. ట్విస్టులు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నా కూడా.. తెరపై మాత్రం ఏం జరుగుతుందో అర్థం కానీ కన్ఫ్యూజన్‌లో ప్రేక్షకులు ఉన్నట్టు అనిపిస్తోంది. అన్నాదమ్ముల మధ్య ఎమోషన్ కూడా కనెక్ట్ అవ్వదు. మొత్తానికి విక్రమ్ పడ్డ కష్టం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరులా అయిపోయింది.
మాథమేటిక్స్ బేస్ చేసుకుని ఈ సినిమాను తీశారు. లెక్కలు రాకపోయినా.. అర్థం కాకపోయినా.. సమస్యలను సాల్వ్ చేయడం పెద్ద కొండను ఎత్తినంత కష్టం, భారంగా అనిపిస్తుంది. ఈ చిత్రం కూడా అంతే భారంగా, కష్టంగా అనిపిస్తుంది. ఏఆర్ రెహమాన్ పాటలు ఆకట్టుకోకపోయినా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం నెక్ట్స్ లెవెల్లో ఉందనిపిస్తుంది. కెమెరామెన్ కొత్త ప్రపంచాన్ని చూపించినట్టు అనిపిస్తుంది. ఎడిటింగ్‌లో చాలా సీన్లు పోయినట్టు అనిపిస్తుంది. అవసరం అయిన సీన్లు పోయి అనవసరమైన సీన్లు ఉన్నట్టు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
బాటమ్ లైన్.. కోబ్రా అర్థంకాని ఆల్ జీబ్రా
రేటింగ్ 2.5