- February 9, 2022
చిరు మీటింగ్‌పై నాని, విష్ణు సెటైర్లు.. వైఎస్ జగన్ అనుకూల నిర్ణయం

Chiranjeevi-YS Jagan చిరంజీవి వైఎస్ జగన్ మీటింగ్ మీద ఎన్ని రకాల సెటైర్లు వచ్చాయో అందరిక తెలిసిందే. మంత్రి పేర్ని నాని అయితే అదేమీ భేటీ కాదు.. భోజనానికి పిలిచారు.. వచ్చాడు.. తిన్నాడు వెళ్లాడు అంటూ ఓ వెటకారపు ధోరణిలోమాట్లాడేశాడు. ఇక మంచు విష్ణు కూడా ఇలాంటి కామెంట్లే చేశాడు. అది పర్సనల్ మీటింగ్ అని అన్నాడు. అయితే జగన్ చిరుది పర్సనల్ మీటింగ్ అయితే.. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు దేనికి సంకేతమో వారే చెప్పాలి.
జగన్ అనుకూల నిర్ణయం తీసుకోబోతోన్నాడట. చిరంజీవి మరోసారి జగన్‌తో రేపు భేటీ కానున్నాడని తెలుస్తోంది. ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, దానయ్య, నాగవంశీ వంటివారిని చిరంజీవి తీసుకుని వెళ్తున్నాడని తెలుస్తోంది. వీరంతా కూడా జగన్‌తో భేటి కానున్నారు. టికెట్ల పెంపు, ఐదు షోలకు అనుమతి వంటి వ్యవహారాల మీద జగన్ సానుకూలంగానే ఉన్నాడని తెలుస్తోంది.
టాలీవుడ్‌కు అనుకూలంగానే నిర్ణయాలు రాబోతోన్నట్టు సంకేతాలు వస్తున్నాయి. గురువారం నాడు ఈ మీటింగ్ జరగబోతోందట. ఇందులో మరి ఎవరెవరు హాజరవుతారో చూడాలి. ప్రభాస్‌కు అనారోగ్య సమస్యలతో రానని అంటున్నాడట. ఇక మిగతా హీరోలు వస్తేనే తాను వస్తానని మహేష్ అన్నాడని సమాచారాం. మరి ఎవరెవరు వెళ్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
ఎవరు వెళ్లినా కూడా అనుకూలమైన నిర్ణయమే రానుందట. మరి నాటి జగన్ చిరు భేటిని కేవలం వ్యక్తిగతం అని అన్నవాళ్లు నేడు జరుగుతున్న పరిణామాలపై ఎలా స్పందిస్తారో చూడాలి. ఆనాడే చిరంజీవి చెప్పేశాడు. త్వరలోనే అనుకూలమైన నిర్ణయం రాబోతోందని ఎంతో ధీమా వ్యక్తం చేశాడు. మొత్తానికి చిరంజీవి చెప్పినట్టుగానే ఇప్పుడు జరుగుతోంది.