• November 9, 2021

కోటి తనయుడి సినిమా.. ముందుకు వచ్చిన మెగాస్టార్

కోటి తనయుడి సినిమా.. ముందుకు వచ్చిన మెగాస్టార్

    స్వరాల పుత్రుడు కోటి తనయుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. కోటి తనయుడు రాజీవ్ సాలూర్ హీరోగా టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకాలపై ‘ప్రొడక్షన్ నెంబర్ 1’గా ఓ కొత్త సినిమా రూపొందుతోంది. కిట్టు నల్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గాజుల వీరేష్ (బళ్లారి) నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. వర్ష విశ్వనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. చిత్రంలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి సాలూర్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

    అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. ఈ క్రమంలో సినిమా ఫస్ట్ లుక్, టైటిల్‌ను చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేయిస్తున్నారు. ఈ మేరకు చిత్రయూనిట్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఈ క్రమంలో స్పెషల్ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. నవంబర్ 11వ తేదీ సాయంత్రం 6 గంటలకు గ్రాండ్‌గా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు సంగీత దిగ్గజం మణిశర్మ అందిస్తున్న సంగీతం మేజర్ అసెట్ కానుంది.

    తమ సంస్థ నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని, చిత్రంలో రాజీవ్ సాలూర్ నటన హైలైట్ కానుందని నిర్మాత గాజుల వీరేష్ (బళ్లారి) అన్నారు. ఈ చిత్రానికి ఈశ్వర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. పవన్ కె అచల మాటలు అందిస్తున్నారు. విష్ణుసూర్య గుంత ఎక్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. అతిత్వరలో ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించనున్నారు.

    Leave a Reply