• January 26, 2022

చిరంజీవికి కరోనా.. బ్యాడ్ లక్ సఖి!

చిరంజీవికి కరోనా.. బ్యాడ్ లక్ సఖి!

    Chiranjeevi Tests Corona Positive మెగాస్టార్ చిరంజీవికి కరోనా వచ్చింది. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. అసలే నిన్న గ్రాండ్‌గా భోళా శంకర్ కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఇందులో మంచి యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ప్లాన్ చేశారట. కానీ ఇంతలోనే చిరు కరోనా బారిన పడ్డారు. మొత్తానికి ఇది షూటింగ్ వల్ల సోకిందో ఏమో తెలియదు కానీ.. చిరు మాత్రం క్వారంటైన్‌లోకి వెళ్లాల్సి వచ్చింది.

    ఇదే విషయాన్ని చిరంజీవి తెలిపారు. నాకు కరోనా పాజిటివ్ అని తేలింది.. స్వల్ప లక్షణాలే ఉన్నాయి.. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాను.. రెండు మూడు రోజులుగా నన్న కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోండి.. అందరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపాడు. దీంతో చిరుకి కరోనా అనే వార్తలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. అయితే చిరంజీవికి కరోనా రావడంతో కీర్తి సురేష్ సినిమా మీద దెబ్బ పడింది.

    కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి సినిమా ఈ వారం రావాల్సి ఉంది. ఈ శుక్రవారం విడుదల కాబోతోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు సాయంత్రం జరగబోతోంది. ఈ ఈవెంట్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా రావాల్సి ఉంది. కానీ అంతలోనే చిరు కరోనా బారిన పడ్డారు. దీంతో చిరంజీవి హాజరవ్వడం కుదరని పని. దీంతో గుడ్ లక్ సఖి కాస్త బ్యాడ్ లక్ సఖి అని మరసారి ఫ్రూవ్ అయింది. గత ఏడాది రావాల్సిన ఈ సినిమానే వాయిదాలు పడుతూ వస్తోంది. మొత్తానికి ఈ వారం ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రాబోతోందన్న మాట.

    Leave a Reply