- November 5, 2021
బయటకు వచ్చిన తేజు పిక్.. చాలా రోజుల తరువాత ట్వీట్ వేసిన సుప్రీమ్ హీరో

మెగా ఇంట్లో దీపావళి పండుగ అంటే కన్నుల విందుగా ఉంటుంది. ఎందుకంటే మెగా హీరోలంతా కూడా ఒకే చోటకు చేరుకుంటారు. అందరూ ఫ్యామిలీ మెంబర్లు కలిసి సందడి చేస్తుంటారు. అయితే ఈ సారి సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదం జరగడంతో మెగా సంబరాలు ఉంటాయో లేవో అని అందరూ ఊహించారు. కానీ దసరాకు డిశ్చార్జ్ అయిన తేజు.. దీపావళికి పూర్తిగా కోలుకున్నాడు. ఇన్ని రోజులు తేజు మొహాన్ని చూపించుకుండా అందరూ ఫోటోలను షేర్ చేశారు.
మొహానికి గాయాలు అవ్వడం వల్ల ఒక్క ఫోటోను కూడా బయటకు రానివ్వలేదు. కానీ తాజాగా తేజు పూర్తిగా కోలుకున్నాడు. దీపావళి వేడుకల్లో పాల్గొన్నాడు. మెగా హీరోలంతా కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. అందరి ఆశీస్సులు దీవెనలు ఫలించి సాయి ధరమ్ తేజ్ పూర్తి గా కోలుకున్నాడు. మా కుటుంబసభ్యులందరికి ఇది నిజమైన పండుగ అంటూ చిరంజీవి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
అందరి ఆశీస్సులు దీవెనలు ఫలించి సాయి ధరమ్ తేజ్ పూర్తి గా కోలుకున్నాడు. మా కుటుంబసభ్యులందరికి ఇది నిజమైన పండుగ. @IamSaiDharamTej pic.twitter.com/DZOepq88ON
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 5, 2021
అయితే ఈ ఫోటోలో అకీరా నందన్ అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక బన్నీ అయితే తన స్టైలీష్ లుక్కులో దర్శనమిచ్చాడు. పవన్ కళ్యాణ్ ఎంతో సింపుల్‌గా ఉన్నాడు. నాగబాబు నవ్వులు చిందిస్తూ కనిపించాడు. రామ్ చరణ్ మీద వరుణ్ తేజ్ వాలిపోయి ఉన్నాడు. మొత్తానికి ఇలాంటి పిక్‌తోనే అభిమానులకు కిక్ వస్తుంది. ఇప్పుడు దీపావళి పండుగ పూర్తయినట్టుంది అభిమానులకు.
నా పునర్జన్మకి కారణమైన మీ ప్రేమకి మీ ప్రార్ధనలకి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను. మీ ప్రేమ పొందడం నా పూర్వజన్మ సుకృతం.🙏🏼 https://t.co/2de1Ob2JgC
— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 5, 2021
బైక్ ప్రమాదానికి గురైన తరువాత ఇంత వరకు సాయి ధరమ్ తేజ్ మొహం చూడలేదు. ఇన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటూ ఉన్న ఈ సుప్రీమ్ హీరో దీపావళికి సెట్ అయ్యాడు. అందరితో కలిసి పండుగ చేసుకున్నాడు. అయితే తాజాగా చిరంజీవి ఓ ఫోటోను షేర్ చేశాడు.అందులో తేజు ఉన్నాడు. అయితే తేజూ పూర్తిగా కోలుకున్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో చాలా రోజుల తరువాత సాయి ధరమ్ తేజ్ మొదటి ట్వీట్ వేశాడు. ‘నా పునర్జన్మకి కారణమైన మీ ప్రేమకి మీ ప్రార్ధనలకి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను. మీ ప్రేమ పొందడం నా పూర్వజన్మ సుకృతం’ అంటూ ఎమోషనల్ అయ్యాడు.