• November 15, 2023

చిరంజీవిపై సోషల్ మీడియాలో విష ప్రచారం.. డ్యాన్స్ వీడియో ట్రోలింగ్‌లో నిజమెంత?

చిరంజీవిపై సోషల్ మీడియాలో విష ప్రచారం.. డ్యాన్స్ వీడియో ట్రోలింగ్‌లో నిజమెంత?

    మెగాస్టార్ చిరంజీవిని తిట్టేందుకు, విమర్శేందుకు సోషల్ మీడియాలో ఓ వర్గం ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ దొరుకుతాడా? అని ఎదురుచూస్తుంటారు. చిరంజీవిని ఎప్పుడు కిందకు లాగుదామా? అని ప్రయత్నిస్తుంటారు. ప్రస్తుతం చిరంజీవి డ్యాన్స్ వీడియోను చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతుంటే.. అవతలి వర్గం మాత్రం తట్టుకోలేకపోతోన్నారు. అందులో పెద్ద బూతు ఉన్నట్టుగా, బ్యాడ్ టచ్ అంటూ హంగామా చేస్తున్నారు.

    చిరంజీవి డ్యాన్స్, గ్రేస్ మీద మెగా ఫ్యాన్స్, సాధారణ నెటిజన్లు మాట్లాడుకుంటూ ఉంటే.. ఓ వర్గం మాత్రం చిరంజీవి బ్యాడ్ టచ్ అంటూ, ఆ ర్యాపర్ రాజ కుమారిని అసభ్య టచ్ చేశాడంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. కానీ అది కావాలని చేసినట్టుగా లేదని అందరికీ ఇట్టే అర్థం అవుతోంది. కానీ చిరంజీవిని ఏదోలా ట్రోల్ చేయాలి, విమర్శించాలనే ఉద్దేశంతో ఉన్న వారు ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

    ప్రతీ సారి ఇలానే చిరంజీవి మీద ఏదో ఒక వివాదాన్ని సృష్టించడం, ట్రోల్ చేయడం, రాక్షస మానసికానందాన్ని పొందడం కొందరికి అలవాటు అయింది. ఇప్పుడు కూడా ఇలానే చిరంజీవి మీద విమర్శలు చేస్తూ కొంత మంది రచ్చ చేస్తున్నారు. ఏదో ఒక విమర్శ చేసి చిరంజీవి మీద బురద జల్లుదామని ప్రయత్నిస్తున్నారు.

    కానీ అభిమానులు మాత్రం ఆ విమర్శలను తిప్పి కొడుతున్నారు. అందులో చెడుగా చూడటానికి ఏముందంటూ రివర్స్‌లో ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి విష ప్రచారాలు ఎప్పుడూ కామన్ అని, బాసు మీద ఇలా బురదజల్లే ప్రయత్నాలు కొత్తేమీ కాదు కదా? అని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.