• November 15, 2021

భారీ సెట్‌లో భోళా శంకర్.. చిరుపై కీలక సీన్స్

భారీ సెట్‌లో భోళా శంకర్.. చిరుపై కీలక సీన్స్

    మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్‌లో రాబోతోన్న భోళా శంకర్ సినిమాను గతవారం లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ పూజా కార్యక్రమాలను దర్శకులందరూ వచ్చారు. వివి వినాయక్, పూరి జగన్నాథ్, కొరటాల శివ, బాబీ, బుచ్చిబాబు సానా ఇలా చాలా మంది దర్శకులు వచ్చారు. పూజా కార్యక్రమాలను విజయవంతం చేశారు. అయితే తాజాగా ఈమూవీ షూటింగ్ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చింది.

    కలకత్తా, అక్కడి ఆపార్ట్మెంట్ వాతావరణాన్ని ఇక్కడే క్రియేట్ చేశారు. కరోనా వల్ల అంత దూరం అక్కడికి వెళ్లి షూటింగ్ చేయడం కష్టమని భావించిన చిత్రయూనిట్ ఇక్కడే కానిచేస్తోంది. సోమవారం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ హైద్రాబాద్‌లో ప్రారంభమైంది. ఏస్ ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్మించిన భారీ సెట్‌లో షూటింగ్ ప్రారంభమైంది. ఈ ఫస్ట్ షెడ్యూల్‌లో చిరంజీవి మీద ముఖ్యమైన సీన్లను తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది.

    మొత్తానికి భోళా శంకర్ మాత్రం ఘనంగా ప్రారంభమైంది. చకచకా షూటింగ్ పూర్తి చేసేట్టు కనిపిస్తున్నారు. ఇటు ఈ చిత్రం.. మరో వైపు బాబీ సినిమా కూడా సెట్స్ మీదకు రాబోతోంది. ఇంకో వైపు గాడ్ ఫాదర్ ఉంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్‌‌లతో చిరు మరింత బిజీ కాబోతోన్నారు. భోళా శంకర్‌లో కీర్తి సురేష్, తమన్నా, రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను తదితరులు నటిస్తున్నారు.

    Leave a Reply