- November 27, 2023
‘పర్‌ఫ్యూమ్’ కు మంచి రెస్పాన్స్

ప్రయోగాత్మక చిత్రాలకు ఆడియెన్స్ నుంచి ఎప్పుడూ ఆదరణ లభిస్తుంటుంది. ప్రస్తుతం చిన్న చిత్రాలు, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు మంచి రెస్పాన్స్ దక్కుతోంది. నవంబర్ 24న విడుదలైన పర్‌ఫ్యూమ్ సైతం స్మెల్ అబ్‌సెషన్ అనే కొత్త కాన్సెప్ట్‌తో రూపొందించింది. ఈ పాయింట్‌తో ఇంత వరకు ఇండియన్ స్క్రీన్ మీద సినిమాలు రాలేదు. ఈ కొత్త కాన్సెప్ట్‌ను శ్రీమాన్ మూవీస్ ప్రజెంట్స్, మిత్రా మూవీ మేకర్స్, ఫరెవర్ ఫ్రెండ్స్ సంయుక్తంగా నిర్మించారు. శ్రీమాన్ మూవీస్ ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసింది.
ఈ చిత్రంలో చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా నటించారు. జే.డి.స్వామి దర్శకత్వంలో తెరకెక్కగా.. జె.సుధాకర్, శివ.బి, రాజీవ్ కుమార్.బి, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని (అమెరికా) లు సంయుక్తంగా ఈ “పర్‌ఫ్యూమ్” చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కొత్త టీం అయినా కూడా ప్రేక్షకులు అవేమీ పట్టించుకోకుండా సినిమాను ఎంకరేజ్ చేస్తున్నారు.
హీరో చేనాగ్ కొత్త వాడైనా కూడా అతని ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నారు. మొదటి సినిమా అయినా కూడా చక్కగా నటించాడు. అన్ని రకాల ఎమోషన్స్‌ను పండించాడు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌లో ఆకట్టుకున్నాడు. విజువల్స్ బాగున్నాయి. ఆర్ఆర్, పాటలు అద్భుతంగా ఉన్నాయి. ఇలా అన్ని రకాలుగా ఈ చిత్రం ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది.